AP University Jobs : ఏపీలో 1523 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్.. ఈ అర్హతలు ఉంటే చాలు
AP University Jobs : ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. 1523 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
notification released to fill 1523 vacancies in ap universities
AP University Jobs : ఆంధ్రప్రదేశ్ సర్కార్ శుభవార్త చెప్పింది. ఒకేసారి 1,523 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇంతకు ఇవి దేనికి సంబంధించిన పోస్టులు అంటే.. ఏపీలోని పలు విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 1523 అధ్యాపక పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 19 విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 1,523 పోస్టులను భర్తీ చేసేందుకు అధికారికంగా నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మొత్తం ఉద్యోగాల్లో 1,244 రెగ్యులర్ పోస్టులు కాగా, మిగిలిన 279 బ్యాక్లాగ్ పోస్టులు.
భర్తీ చేయనున్న పోస్టులు – వర్సిటీలు:
ఈ నోటిఫికేషన్ ద్వారా ఏపీ సర్కార్.. పలు యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న 1523 ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనుంది. అభ్యర్థులను ఎంపిక చేసే ప్రధాన విశ్వవిద్యాలయాలు ఏవంటే..
- ఆంధ్ర యూనివర్సిటీ
- ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం
- ఆర్జీయూకేటీ (RGUKT)
- జేఎన్టీయూ కాకినాడ, జేఎన్టీయూ అనంతపురం
- ద్రవిడియన్, రాయలసీమ విశ్వవిద్యాలయాలు
- శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం
- యోగి వేమన, ఆంధ్రకేసరి, అంబేడ్కర్ విశ్వవిద్యాలయాలు
- శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం
- వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ
అర్హతలు
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈ కింది అర్హతలు కలిగి ఉండాలి.
విద్యార్హత:
ఈ పోస్టులకు అప్లై చేసుకునే వారు పోస్ట్ గ్రాడ్యుయేషన్ (PG) తో పాటు పీహెచ్డీ/సెట్/నెట్ (PhD/SET/NET) లలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ:
పోస్టుల రకాన్ని బట్టి రాత పరీక్ష లేదంటే కొన్ని పోస్టులకు ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు విధానం:
- ఆసక్తిగల అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ పద్ధతిలో మాత్రమే ఈ పోస్టులకు తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.
- ఆన్లైన్ దరఖాస్తుకు 2026 జూన్ 8ని చివరి తేదీగా నిర్ణయించారు.
పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి నోటిఫికేషన్‌ను పరిశీలించవచ్చు.
