AFG vs ZIM : జింబాబ్వే సంచలనం.. 149 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి.. ఆసీస్, భారత్, ఇంగ్లాండ్ ఏ దేశం వల్ల కాలేదు..
AFG vs ZIM : టెస్టు క్రికెట్లో జింబాబ్వే జట్టు అరుదైన ఘనత సాధించింది.
Zimbabwe become 1st team in Test cricket to score 500 plus in both innings
AFG vs ZIM : టెస్టు క్రికెట్లో జింబాబ్వే జట్టు అరుదైన ఘనత సాధించింది. 149 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో భారత్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా ఇలా ఏ జట్టుకు సాధ్యం కానీ రికార్డును సాధించింది. ఓ టెస్టు మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ 500 ఫ్లస్ స్కోర్లు నమోదు చేసిన తొలి జట్టుగా నిలిచింది. అఫ్గానిస్థాన్‌తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో జింబాబ్వే ఈ ఘనత సాధించింది.
షార్జా వేదికగా అఫ్గానిస్థాన్, జింబాబ్వే జట్ల మధ్య నవంబర్ 5 నుంచి 9 వరకు తొలి టెస్టు మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న జింబాబ్వే మొదటి ఇన్నింగ్స్‌లో 134.3 ఓవర్లలో 504 పరుగులకు ఆలౌటైంది. బ్రెండన్ టేలర్ (131), బ్రియాన్ బెన్నెట్ (128) లు శతకాలు సాధించారు.
IND vs NZ : ఒక్క బంతి పడకుండానే భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మూడో వన్డే మ్యాచ్ రద్దు..
అనంతరం అఫ్గానిస్థాన్ జట్టు కూడా ధీటుగా ఆడింది. సెదిఖుల్లా ఆటల్(105), రహ్మనుల్లా జద్రాన్(113), రహ్మత్ షా (173)లు సెంచరీలతో చెలరేగడంతో తొలి ఇన్నింగ్స్‌లో అఫ్గానిస్థాన్ జట్టు 514 పరుగులకు ఆలౌటైంది. దీంతో అఫ్గాన్‌కు 10 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. ఆ తరువాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన జింబాబ్వే జట్టుకు శుభారంభం దక్కలేదు. తక్కువ పరుగులకే ఓపెనర్లు పెవిలియన్‌కు చేరుకున్నారు.
అయితే.. క్రెయిగ్ ఎర్విన్ (206 నాటౌట్) ద్విశతకానికి తోడు వెస్లీ మాధవేరే (100 నాటౌట్) సెంచరీ చేయడంతో జింబాబ్వే రెండో ఇన్నింగ్స్‌లో 122.1 ఓవర్లలో 523/5 స్కోరు చేసింది. బ్రెండన్ టేలర్ (82), బ్రియాన్ బెనెట్ (58), అంతుమ్ నక్వి (61) అర్థశతకాలు సాధించారు. మ్యాచ్ డ్రాగా ముగిసింది.
