IND vs NZ : ఒక్క బంతి పడకుండానే భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మూడో వన్డే మ్యాచ్ రద్దు..
IND vs NZ : భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య హామిల్టన్ వేదికగా జరగాల్సిన మూడో వన్డే మ్యాచ్ రద్దైంది.
IND vs NZ 3rd ODI Match abandoned dueto rain
IND vs NZ : భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య హామిల్టన్ వేదికగా జరగాల్సిన మూడో వన్డే మ్యాచ్ రద్దైంది. వర్షం కారణంగా ఈ మ్యాచ్లో ఒక్క బంతి కూడా సాధ్యపడలేదు. కేవలం టాస్ మాత్రమే వేశారు. టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది.
షెడ్యూల్ ప్రకారం ఉదయం 7.30 గంటలకు ప్రారంభం కావాల్సి ఉన్నా కూడా వరుణుడి అంతరాయంతో ఉదయం 9 గంటలకు టాస్ పడింది. టాస్ వేసిన వెంటనే మరోసారి స్టేడియాన్ని వరుణుడు ముంచెత్తాడు. పలుమార్లు ఆగుతూ వస్తూ మైదానం సిబ్బందికి వరుణుడు పని పెట్టాడు. కనీసం 20 ఓవర్ల మ్యాచ్ అయినా చూడకపోతామా అని ఎంతో ఆశగా ఎదురుచూసిని అభిమానులకు నిరాశే ఎదురైంది. ఆట సాధ్యపడే అవకాశం లేకపోవడంతో మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లుగా అంపైర్లు ప్రకటించారు.
𝗨𝗽𝗱𝗮𝘁𝗲 𝗳𝗿𝗼𝗺 𝗛𝗮𝗺𝗶𝗹𝘁𝗼𝗻:
The third New Zealand-India ODI is called off due to rain.
#TeamIndia | #NZvIND https://t.co/LtrfDalRcz
— BCCI (@BCCI) November 10, 2026
తొలి రెండు వన్డేలకు వరుణుడు ఆటంకం కలిగించినా కూడా ఆట సాధ్యమైంది. అయితే.. మూడో వన్డేలో ఒక్క బంతి కూడా వేసేందుకు వీలు లేకుండా పోయింది.
ఇదిలా ఉంటే.. తొలి రెండు వన్డేలు గెలిచిన భారత్ ప్రస్తుతం 2-0 ఆధిక్యంలో ఉంది. ఇరు జట్ల మధ్య నాలుగో వన్డే మ్యాచ్ నవంబర్ 13న మౌంట్ మౌంగనుయి వేదికగా జరగనుంది.
