SBI Apprentice 2026 : డిగ్రీ పాస్ అయిన వారికి శుభవార్త.. SBIలో జాబులు.. తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని పోస్టులంటే..!
SBI Apprentice 2026 : ఎస్బీఐలో 7,150 అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఆ వివరాలు..
SBI Apprentice Recruitment 2026 7150 Vacancies filled Eligibility Application process and Stipend full Details here
SBI Apprentice 2026 : అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన భారతీయ స్టేట్ బ్యాంక్ (SBI) శుభవార్త చెప్పింది. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ వంటి ముఖ్య నగరాలతో పాటుగా దేశవ్యాప్తంగా పలు నగరాల్లో 7,150 అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీకి సిద్ధమైంది. ఈ మేరకు తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంత భారీ మొత్తంలో భర్తీ ప్రక్రియ చేపడుతున్నందున పెద్ద సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటారని ఎస్బీఐ భావిస్తోంది.
విద్యార్హత
అప్రెంటిస్ ఉద్యోగాల పట్ల ఆసక్తి గల అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుండి గ్రాడ్యుయేషన్ (డిగ్రీ) పూర్తి చేసి ఉండాలి.
వయోపరిమితి
- విద్యార్హతతో పాటు, అభ్యర్థులు నిర్దేశిత వయోపరిమితిని కలిగి ఉండాలి.
- ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థుల వయస్సు 2026, మే 1 నాటికి 20 నుండి 28 సంవత్సరాల మధ్య ఉండాలి.
మొత్తం పోస్టులు
- మొత్తం 7,150 అప్రెంటిస్ ఉద్యోగాలను భర్తీ చేస్తుండగా..
తెలుగు రాష్ట్రాల్లో
- ఈ ఖాళీలలో తెలంగాణ నుంచి 491 పోస్టులు ఉన్నాయి.
- రాష్ట్రంలోనే అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 22 ఖాళీలు ఉన్నాయి.
- హైదరాబాద్‌లో 10 ఖాళీలు ఉన్నాయి.
- ఆంధ్రప్రదేశ్ నుంచి 709 సీట్లు భర్తీ చేయనున్నారు.
అయితే ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు ఏదైనా ఒక రాష్ట్రానికి మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని గమనించాలి.
ట్రైనింగ్ కాలం
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఈ శిక్షణ (ట్రైనింగ్) కాలపరిమితి ఒక సంవత్సరం ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ
హైదరాబాద్, ఇతర నగరాల్లో ఈ ఎస్బీఐ అప్రెంటిస్ ఉద్యోగాలకు ఆన్లైన్ రాత పరీక్షతో పాటుగా స్థానిక భాషా పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
జీతం
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ప్రతి నెలా రూ. 15,000 స్టైపెండ్ లభిస్తుంది.
పరీక్ష విధానం
ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసే ప్రక్రియలో
మొదటి దశలో:
- ఆన్లైన్ రాత పరీక్ష నిర్వహిస్తారు.
- ఇది ‘జనరల్/ఫైనాన్షియల్ అవేర్నెస్’, ‘జనరల్ ఇంగ్లీష్’, ‘క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్’, ‘రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్’ అంశాలపై ఆధారపడి ఉంటుంది.
రెండో దశలో:
- రాత పరీక్ష తర్వాత, అభ్యర్థులు స్థానిక భాషా పరీక్ష రాయాల్సి ఉంటుంది.
ఇలా చేస్తే పరీక్ష అవసరం లేదు:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ 10వ తరగతి లేదా 12వ తరగతి మార్కుల సర్టిఫికేట్లో తాము ఎంచుకున్న స్థానిక భాషను ఒక సబ్జెక్టుగా చదివినట్లు రుజువు చూపిస్తే.. సదరు అభ్యర్థులకు ఈ భాషా పరీక్ష నుండి మినహాయింపు లభిస్తుంది.
మూడో దశలో:
రాత పరీక్షల ప్రక్రియ ముగిసిన తర్వాత.. పోస్టుకు సంబంధించిన అర్హతల పరిశీలన, ఆన్లైన్ దరఖాస్తులో సమర్పించిన వివరాల ధృవీకరణ, ఎంపికైన ప్రాంతంలో స్థానిక భాషా పరీక్షలో అర్హత సాధించడంతో పాటు వైద్య పరీక్షలలో (మెడికల్ ఎగ్జామినేషన్) సాధించిన ఉత్తీర్ణత ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం
- ఆసక్తిగల అభ్యర్థులు ముందుగా అధికారిక ఎన్ఏపీఎస్ (NAPS) పోర్టల్ (www.apprenticeshipindia.gov.in) లో తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాలి.
- ఆ తర్వాత ఎస్బీఐ అధికారిక వెబ్సైట్ (sbi.bank.in/web/careers లేదా sbi.bank.in/web/careers/current-openings) ద్వారా ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫారమ్‌లో:
- వ్యక్తిగత, విద్యా వివరాలు ఎంటర్ చేయాలి.
- ఆ తర్వాత అభ్యర్థి ఫోటో, సంతకం స్కాన్ కాపీలను అప్లోడ్ చేయాలి.
- చివరగా ఆన్లైన్ పేమెంట్ ద్వారా ఫీజు చెల్లించాలి.
ముఖ్య తేదీలు:
- ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ: 19.05.2026.
- దరఖాస్తు, ఫీజు చెల్లింపునకు చివరి తేదీ: 08.06.2026.
- ఆన్లైన్ పరీక్ష నిర్వహణ (తాత్కాలికంగా): జులై 2026 నెలలో
ఆసక్తి గల అభ్యర్థులు ఎస్బీఐ అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
