Ante Sundaraniki: అంటే సుందరానికి నుండి ప్రేయర్ ఆఫ్ లీలా.. ఇంట్రో అదిరింది!

నేచురల్ స్టార్ నాని ఇటీవల ‘శ్యామ్ సింగ రాయ్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.....

Ante Sundaraniki: అంటే సుందరానికి నుండి ప్రేయర్ ఆఫ్ లీలా.. ఇంట్రో అదిరింది!

Impressive Nazriya Fahadh Intro Prayer Of Leela From Ante Sundariniki

Ante Sundaraniki: నేచురల్ స్టార్ నాని ఇటీవల ‘శ్యామ్ సింగ రాయ్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. అంతకు ముందు వరుసగా ‘వి’, ‘టక్ జగదీష్’ చిత్రాలతో ఫ్లాపులు మూటగట్టుకున్న ఈ హీరో, శ్యామ్ సింగ రాయ్ చిత్రంతో విజయాన్ని అందుకుని బౌన్స్‌బ్యాక్ అయ్యాడు. ఇక ఈ సినిమా తరువాత వరుసబెట్టి సినిమాలు చేస్తూ ఫుల్ స్పీడుమీదున్నాడు ఈ హీరో. అయితే తాజాగా ‘అంటే సుందరానికి’ అనే పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీతో మనముందుకు వచ్చేందుకు నాని రెడీ అవుతున్నాడు.

Ante Sundaraniki: సినిమాకో వేరియేషన్.. నా టేస్టే వేరంటున్న నాని!

ఈ సినిమాను దర్శకుడు వివేక్ ఆత్రేయ తెరకెక్కిస్తుండగా, ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్స్, టీజర్స్ ఈ సినిమాపై మంచి అంచనాలను క్రియేట్ చేశాయి. కాగా ఈ సినిమాలో మలయాళ బ్యూటీ నజ్రియా ఫాహద్ తొలిసారి టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోంది. ఈ చిత్రంలో ఆమె లీలా థామస్ అనే పాత్రలో నటిస్తోంది. ఓ బ్రాహ్మణ కుర్రాడు, ఒక క్రిస్టియన్ అమ్మాయి మధ్య సాగే ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు చిత్ర యూనిట్.

ఇక తాజాగా ఈ సినిమా నుండి హీరోయిన్ నజ్రియా ఫాహద్ పాత్రకు సంబంధించిన టీజర్ వీడియోను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ‘ప్రేయర్ ఆఫ్ లీలా’ అనే పేరుతో రిలీజ్ అయిన ఈ టీజర్ వీడియోలో నజ్రియా ఓ ఫోటోగ్రాఫర్‌గా.. తన జీవితాన్ని అందంగా జీవించాలని కోరుకునే అమ్మాయిగా పరిచయం అయ్యింది. ఇలా భిన్న మతాలు, భిన్న మనస్తత్వాలు కలిగిన ఇద్దరి మధ్య ప్రేమ ఎలా పుడుతుందా.. వారిద్దరు ఎలా కలుస్తారా అనేది సినిమా కథగా మనకు చూపించనున్నారు.

Ante Sundaraniki: నాని సినిమాకి ఏడు రిలీజ్ డేట్స్.. పెద్ద చిక్కే!

మొత్తానికి నాని చాలా రోజుల తరువాత కామెడీ ఫ్యామిలీ డ్రామాతో మనముందుకు వస్తుండటంతో ఈ సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. కాగా ఈ సినిమాను దర్శకుడు వివేక్ ఆత్రేయ అద్భుతంగా మలుస్తుండగా, వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక ఈ సినిమాను జూన్ 10న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.