Gold Rate Today : బంగారం, వెండి కొనుగోలుదారులకు అలర్ట్.. ఏపీ, తెలంగాణలో నేటి ధరలు ఇవే..
Gold Rate Today : మంగళవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.

Gold Rate Today : బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి బిగ్ అలర్ట్. గోల్డ్, సిల్వర్ ధరల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి.

బంగారం ధరల్లో ఇటీవల కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అయితే, మంగళవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. బంగారం ధర స్థిరంగా కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం గోల్డ్ రేటు భారీగా పెరిగింది. ఔన్సు గోల్డ్‌పై 50డాలర్లు పెరగ్గా.. ప్రస్తుతం అక్కడ ఔన్సు గోల్డ్ 4,534 డాలర్ల వద్ద కొనసాగుతోంది. వెండి ధరల్లోనూ ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు.

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,56,220 వద్దకు చేరగా.. 22క్యారట్ల 10గ్రాముల బంగారం రూ.1,43,200 వద్దకు చేరింది.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,56,370 కాగా.. 22 క్యారట్ల బంగారం ధర రూ.1,43,350 వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్‌కతా, చెన్నై నగరాల్లో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,58,180కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ.1,45,000వద్ద కొనసాగుతుంది.

వెండి ధరలను పరిశీలిస్తే.. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.2,90,000 వద్దకు చేరింది. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో ప్రస్తుతం కిలో వెండి రేటు రూ.2,80,000 వద్ద కొనసాగుతోంది. చెన్నైలో కిలో వెండి రేటు రూ.2,90,000 వద్ద కొనసాగుతోంది.

గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
