Amazon Great Freedom Sale : అమెజాన్ బంపర్ సేల్ ఆఫర్లు.. రూ.20వేల లోపు 32-అంగుళాల స్మార్ట్‌టీవీలపై దిమ్మతిరిగే డిస్కౌంట్లు..!
Amazon Great Freedom Sale : స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అమెజాన్ 'అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్'ను ప్రారంభించింది. ఈ సేల్ సమయంలో అనేక బ్రాండ్ల స్మార్ట్ టీవీలపై అద్భుతమైన డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది.
Amazon Great Freedom Sale
- శాంసంగ్ 32 అంగుళాల HD స్మార్ట్ టీవీ రూ. 15,490 ధర మాత్రమే
- అమెజాన్ సేల్ సమయంలో ఫిలిప్స్ 6100 సిరీస్ టీవీ రూ. 15,999కే
- షావోమీ F సిరీస్ స్మార్ట్ టీవీ అమెజాన్‌లో రూ. 12,999 ధరకే
Amazon Great Freedom Sale : కొత్త స్మార్ట్‌టీవీ కొనేందుకు చూస్తున్నారా? స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్‌ను ప్రారంభించింది. ఈ సేల్ మొబైల్ ఫోన్లు, టీవీలు, ఎలక్ట్రానిక్స్‌పై భారీ డిస్కౌంట్లను అందిస్తుంది.
32-అంగుళాల స్మార్ట్‌టీవీలపై అద్భుతమైన డీల్స్‌ను అందిస్తోంది. ఈ సేల్‌లో సరసమైన ధరలకు కొనేసుకోవచ్చు. అమెజాన్ ఫ్రీడమ్ సేల్‌లో (Amazon Great Freedom Sale) శాంసంగ్, ఫిలిప్స్, టీసీఎల్, షావోమీ, వీడబ్ల్యూ కంపెనీల స్మార్ట్ టీవీలు భారీ తగ్గింపులతో అందుబాటులో ఉన్నాయి. 32-అంగుళాల స్మార్ట్ టీవీలపై డిస్కౌంట్లు, ఆఫర్లను ఇప్పుడు వివరంగా చూద్దాం..
శాంసంగ్ 32 అంగుళాల HD స్మార్ట్ ఎల్ఈడీ టీవీ :
ఈ-కామర్స్ సైట్ అమెజాన్‌లో రూ. 15,490కి ఈ శాంసంగ్ స్మార్ట్ టీవీ లిస్టు అయింది. బ్యాంక్ ఆఫర్లతో HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా పేమెంట్ చేస్తే 10శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ (రూ.1750 వరకు) పొందవచ్చు. ఆ తర్వాత ఈ టీవీ ధర రూ. 13,941 అవుతుంది.
ఈ శాంసంగ్ టీవీ 768p రిజల్యూషన్, 50Hz రిఫ్రెష్ రేట్‌తో 32MP డిస్ప్లేతో వస్తుంది. ప్రత్యేకమైన శాంసంగ్ నాక్స్ సెక్యూరిటీ ఫీచర్‌తో వస్తుంది. ఇతర ఫీచర్లలో వాయిస్ సెర్చ్ రిమోట్ కంట్రోల్, HDR, శాంసంగ్ టీవీ ప్లస్ ఉన్నాయి. శాంసంగ్ టైజెన్ OSపై కూడా రన్ అవుతుంది.
ఫిలిప్స్ 32 అంగుళాల 6100 సిరీస్ ఫ్రేమ్‌లెస్ టీవీ :
ఈ అమెజాన్ సేల్‌లో ఫిలిప్స్ 32 అంగుళాల 6100 సిరీస్ రూ. 15,999 ధరకే లభిస్తోంది. బ్యాంక్ ఆఫర్లతో HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా 10శాతం ఇన్ స్టంట్ డిస్కౌంట్ రూ.1750 వరకు పొందవచ్చు. ఆ తర్వాత అసలు ధర రూ. 14,400 అవుతుంది.
ఈ ఫిలిప్స్ టీవీలో 32-అంగుళాల HD LED డిస్ప్లే ఉంది. దీనికి 720p రిజల్యూషన్, 60Hz రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. ఈ టీవీ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, జీ5, ఇతర ఓటీటీ యాప్‌లకు సపోర్ట్ చేస్తుంది. ఇందులో క్రోమ్‌కాస్ట్, గూగుల్ వాయిస్ అసిస్టెంట్, డ్యూయల్ బ్యాండ్ వై-ఫై ఉన్నాయి.
టీసీఎల్ 32 అంగుళాల HD రెడీ స్మార్ట్ QLED గూగుల్ టీవీ :
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్‌లో ఈ టీసీఎల్ గూగుల్ టీవీ ధర రూ. 16,490కి లభిస్తోంది. బ్యాంక్ ఆఫర్ల విషయానికి వస్తే.. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా పేమెంట్ చేస్తే 10శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ (రూ. 1750 వరకు) పొందవచ్చు. ఆ తర్వాత ధర రూ. 14,841కి తగ్గుతుంది.
ఈ టీసీఎల్ టీవీలో 32-అంగుళాల HD రెడీ క్యూఎల్ఈడీ డిస్ప్లే ఉంది. దీనికి 768p రిజల్యూషన్, 60Hz రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. ఈ టీవీలో 1GB ర్యామ్, 8GB ROM ఉన్నాయి. ఇందులో 64-బిట్ క్వాడ్ కోర్ ప్రాసెసర్ ఉంది. ఈ టీవీ గూగుల్ అసిస్టెంట్‌కు సపోర్ట్ చేస్తుంది.
VW 32 అంగుళాల స్పెక్ట్రా సిరీస్ HD రెడీ స్మార్ట్ QLED టీవీ :
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్‌లో ఈ ఆండ్రాయిడ్ టీవీ రూ. 9,499 ధరకు లభిస్తోంది. బ్యాంక్ ఆఫర్లతో అమెజాన్ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ పేమెంట్లపై రూ.284 క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఆ తర్వాత ఈ టీవీ ధర రూ. 9,215 అవుతుంది. ఈ VW టీవీలో 32-అంగుళాల HD రెడీ QLED డిస్ప్లే ఉంది. 1080 పిక్సెల్ రిజల్యూషన్, 60Hz రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. ఈ టీవీలో క్వాడ్ కోర్ ప్రాసెసర్ ఉంది. ప్రైమ్ వీడియో, జియో హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్, Z5కు సపోర్ట్ చేస్తుంది.
షావోమీ 32 అంగుళాల ఎఫ్ సిరీస్ స్మార్ట్‌టీవీ
ఈ షావోమీ ఎఫ్ సిరీస్ టీవీ ధర రూ. 12,999గా ఉంది. బ్యాంక్ ఆఫర్లతో HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా పేమెంట్ చేస్తే 10శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ (రూ. 1750 వరకు) పొందవచ్చు. ఆ తర్వాత అసలు ధర రూ. 11,700 అవుతుంది.
షావోమీ 32 అంగుళాల ఎఫ్ సిరీస్ స్మార్ట్ టీవీలో 32 అంగుళాల హెచ్డీ రెడీ డిస్ప్లే ఉంది. రిజల్యూషన్ 1366×768 పిక్సెల్స్, 60Hz. ఈ టీవీలో బ్లూటూత్, ఇంటర్నల్ వై-ఫై ఉన్నాయి. ఈ టీవీ 20W అవుట్‌పుట్, డాల్బీ ఆడియో, డీటీఎస్-హెచ్డీకి సపోర్ట్ చేస్తుంది.
