EPFO Big Update : పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్..సెప్టెంబర్ పీఎఫ్ డబ్బులపై బిగ్ అప్డేట్..!
EPFO Big Update : సెప్టెంబర్ నెల పీఎఫ్ కాంట్రిబ్యూషన్ జమకు అక్టోబర్ 31 వరకు గడువు ఉందా? మీ పీఎఫ్ పాస్‌బుక్‌ను ఆన్లైన్లో ఎలా చెక్ చేయాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
EPFO Big Update Deposit
- పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. అక్టోబర్ 31లోపు డబ్బులు జమ
- పీఎఫ్ కాంట్రిబ్యూషన్‌కు కొత్త గడువు.. ఉద్యోగులు ఇలా చెక్ చేసుకోండి
- మీ పీఎఫ్ ఖాతాలో డబ్బులు జమ అయ్యాయా? ఇలా తెలుసుకోండి
EPFO Big Update : మీకు పీఎఫ్ ఖాతా ఉందా? అయితే, మీకో బిగ్ అప్డేట్. గత సెప్టెంబర్ నెలలో పీఎఫ్ డబ్బులు ఎక్కువ కట్ అయ్యాయా? ఆ డబ్బులు మీ పీఎఫ్ ఖాతాలో జమ అయ్యాయా? దీనికి సంబంధించి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) కాంట్రిబ్యూషన్ ఖాతాల్లో డిపాజిట్ చేసేందుకు కంపెనీలకు అక్టోబర్ 31 వరకు గడువు ఇచ్చింది. పీఎఫ్ ఖాతాలో శాలరీలో కట్ అయిన డబ్బులు ఎప్పుడు జమ అవుతాయా? అని ఎదురుచూస్తున్న ఉద్యోగులు తమ పాస్‌బుక్‌ను చెక్ చేసుకోండి..
అక్టోబర్ 31 వరకు గడువు పొడిగింపు :
సాధారణంగా కంపెనీలు ప్రతి నెలా 15వ తేదీలోపు అంతకుముందు నెలకు సంబంధించిన పీఎఫ్ కాంట్రిబ్యూషన్‌ను ఈపీఎఫ్ఓకు జమ చేయాలి. అయితే, సెప్టెంబర్ నెల కాంట్రిబ్యూషన్‌కు సంబంధించి కంపెనీలకు అక్టోబర్ 31 వరకు గడువు ఇచ్చినట్లు సమాచారం. దీనివల్ల కంపెనీలకు అదనపు సమయం లభించనుంది.
కంపెనీలకు ఎందుకు అదనపు సమయం? :
పీఎఫ్ వేతన పరిమితిలో మార్పులు, పేరోల్ వివరాల సర్దుబాట్లు వంటి అంశాల నేపథ్యంలో కంపెనీలకు అదనపు సమయం తప్పనిసరి. ఉద్యోగుల పీఎఫ్, పెన్షన్ కాంట్రిబ్యూషన్ల లెక్కల్లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా రికార్డులను సరిచేసుకునేందుకు ఈ గడువు అవసరం.
అయితే, ఈ గడువు పొడిగింపు సెప్టెంబర్ నెల కాంట్రిబ్యూషన్‌కు మాత్రమే వర్తిస్తుందని గుర్తుంచుకోవాలి. తర్వాతి నెలల నుంచి సాధారణ గడువుల ప్రకారమే పీఎఫ్ కాంట్రిబ్యూషన్ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.
మీ పీఎఫ్ ఖాతాలో డబ్బులు జమ అయ్యాయా? :
మీ పీఎఫ్ కాంట్రిబ్యూషన్ జమ అయిందో లేదో తెలుసుకోవడానికి ఈపీఎఫ్ఓ పాస్‌బుక్‌ను ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు.
- ఈపీఎఫ్ఓ అధికారిక వెబ్‌సైట్‌ను విజిట్ చేయండి.
- మీ UAN, పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వండి.
- పాస్‌బుక్ సెక్షన్లోకి వెళ్లి సంబంధిత నెల ఎంట్రీని చెక్ చేయండి.
- సెప్టెంబర్ నెల కాంట్రిబ్యూషన్ వివరాలు ఉన్నాయో లేదో చూడండి.
Note : అక్టోబర్ 31 గడువు ఉందని ప్రతి ఉద్యోగి ఖాతాలో అదే రోజున డబ్బులు ఖాతాలో పడతాయని అర్థం కాదు. మీ పాస్‌బుక్‌లో ఎంట్రీ లేకపోతే, ముందుగా మీ కంపెనీ HR లేదా పేరోల్ విభాగాన్ని సంప్రదించి వివరాలు తెలుసుకోండి.
