PM-SYM Scheme 2026 : చిరువ్యాపారులకు నెలకు రూ.3,000 పెన్షన్! అర్హతలు ఇవే.. ఇలా అప్లయ్ చేసుకోండి!
PM-SYM Scheme 2026 : చిన్న వ్యాపారులు, దుకాణదారులకు నెలకు రూ.3,000 పెన్షన్ పొందే అవకాశం. వయస్సు, టర్నోవర్ అర్హతలు, దరఖాస్తు విధానం, ఈ-శ్రమ్ హెల్ప్‌లైన్ వివరాలు తెలుసుకోండి.
PM-SYM Scheme 2026
- చిన్న దుకాణదారులకు గుడ్ న్యూస్.. 60 ఏళ్ల తర్వాత నెలకు రూ.3వేలు పెన్షన్
- మీరు వ్యాపారం చేస్తున్నారా? కేంద్ర ప్రభుత్వ పెన్షన్ పథకం గురించి తెలుసా?
- వ్యాపారులకు వృద్ధాప్యంలో ఆర్థిక భరోసా.. రూ.3,000 పెన్షన్ ఎలా పొందాలంటే?
- 18–70 ఏళ్ల వ్యాపారులకు అలర్ట్.. నెలవారీ పెన్షన్ కోసం ఈ అర్హతలు తప్పనిసరి
PM-SYM Scheme 2026 : చిన్న వ్యాపారాలు చేసేవారికి గుడ్ న్యూస్.. వృద్ధాప్యంలో ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పెన్షన్ పథకాన్ని (The Pradhan Mantri Shram Yogi Maandhan (PM-SYM) ) అందిస్తోంది. చిన్న దుకాణదారులు, రిటైల్ వ్యాపారులు, స్వయం ఉపాధి పొందుతున్న వారికి ఈ పథకం ద్వారా 60 ఏళ్లు నిండిన తర్వాత నెలకు రూ.3వేలు పెన్షన్ పొందే అవకాశం ఉంది. అంటే.. ఏడాదికి రూ.36వేల వరకు పెన్షన్ లభిస్తుంది.
అయితే, ఈ బెనిఫిట్ పొందాలంటే కొన్ని అర్హతలు తప్పనిసరిగా ఉండాలి. అవేంటో ఓసారి లుక్కేయండి..
NPS పథకం ఏంటి? :
చిన్న వ్యాపారులు తమ సంపాదనలో ఎక్కువ మొత్తాన్ని వ్యాపారంలోనే పెట్టుబడిగా పెడుతుంటారు. దీంతో వృద్ధాప్యం కోసం పొదుపు చేయడం చాలామందికి కష్టంగా మారుతుంది. ఇలాంటి వారికి ఆర్థిక భద్రత కల్పించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశం. అర్హత ఉన్న వ్యాపారులు నిర్ణీత మొత్తాన్ని నెలనెలా చెల్లిస్తూ 60 ఏళ్ల తర్వాత నెలవారీ పెన్షన్ పొందవచ్చు.
ఎవరు అర్హులు?
ఈ పథకం కింద చేరాలనుకునే వారు ఈ వివరాలను తప్పనిసరిగా తెలుసుకోవాలి.
వయస్సు : దరఖాస్తు చేసే సమయంలో 18 నుంచి 70 ఏళ్ల మధ్య ఉండాలి.
వ్యాపార టర్నోవర్ : ఏడాదికి రూ.1.5 కోట్లకు మించకూడదు.
ఎవరికి వర్తిస్తుంది? : అర్హులైన చిన్న దుకాణదారులు, రిటైల్ వ్యాపారులు, స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తులు.
పెన్షన్ : 60 ఏళ్లు నిండిన తర్వాత నెలకు రూ.3వేలు.
చందా : పథకంలో చేరినవారు తమ వయస్సుకు అనుగుణంగా నిర్ణయించిన మొత్తాన్ని నెలవారీగా చెల్లించాలి.
ఎలా అప్లయ్ చేసుకోవాలి? :
ఈ పథకానికి సంబంధించిన తాజా మార్గదర్శకాలు, దరఖాస్తు విధానం, అవసరమైన డాక్యుమెంట్ల వివరాలను అధికారిక ప్రభుత్వ పోర్టల్ లేదా సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ (CSC) వద్ద తెలుసుకోవచ్చు. పథకం పేరు, అర్హతలను నిర్ధారించుకుని దరఖాస్తు చేసుకోవడం మంచిది.
ఈ-శ్రమ్ హెల్ప్‌లైన్ వివరాలివే :
ఈ-శ్రమ్ పోర్టల్‌కు సంబంధించి సందేహాలు లేదా సమస్యలు ఉంటే 14434 లేదా 18008896811 నంబర్లకు ఫోన్ చేయవచ్చు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు హెల్ప్ లైన్ అందుబాటులో ఉంటుంది. eshramcare-mole@gov.inకు ఈ-మెయిల్ పంపవచ్చు. మరిన్ని వివరాల కోసం (eshram.gov.in) వెబ్‌సైట్‌ను విజిట్ చేయండి.
Note : అప్లయ్ చేసే ముందు చిన్న వ్యాపారుల కోసం ఉద్దేశించిన ప్రధానమంత్రి శ్రమ యోగి మాన్‌ధన్ (PM-SYM) పథకానికి సంబంధించిన అర్హతలు, చందా మొత్తం, దరఖాస్తు విధానాన్ని తెలుసుకోండి.
