Google Diwali Sale 2026 : గూగుల్ పండుగ ఆఫర్లు.. ఈ పిక్సెల్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. బ్యాంక్ క్యాష్‌బ్యాక్, ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా!
Google Diwali Sale 2026 : గూగుల్ పిక్సెల్ 11పై రూ.26వేల వరకు ఆఫర్లు, పిక్సెల్ 11 ప్రో, ఫోల్డ్, పిక్సెల్ 10, పిక్సెల్ 10a ఫోన్లపై భారీ డిస్కౌంట్లు, బ్యాంక్ క్యాష్‌బ్యాక్, ఎక్స్ఛేంజ్ బోనస్ వంటివి ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం..
Google Diwali Sale 2026
పిక్సెల్ 11పై ఏకంగా రూ.26,000 ఆఫర్..
పిక్సెల్ 10, 10a ధరలు కూడా తగ్గాయ్
పిక్సెల్ 11 ప్రో నుంచి ఫోల్డ్ వరకు భారీ డిస్కౌంట్లు..
గూగుల్ దీపావళి సేల్‌లో బెస్ట్ డీల్స్ ఇవే
Google Diwali Sale 2026 : దీపావళి పండుగకు ముందే స్మార్ట్‌ఫోన్ ప్రియులకు గూగుల్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. భారత మార్కెట్లో గూగుల్ దీపావళి సేల్ 2026 ప్రారంభమైంది. ఈ సేల్‌లో లేటెస్ట్ పిక్సెల్ 11 సిరీస్ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు, బ్యాంక్ క్యాష్‌బ్యాక్, ఎక్స్ఛేంజ్ బోనస్, నో-కాస్ట్ ఈఎంఐ ఆఫర్లు అందిస్తోంది. గూగుల్ అధికారిక స్టోర్‌లో ఈ ఆఫర్లు నవంబర్ 8, 2026 వరకు అందుబాటులో ఉండనున్నాయి.. పూర్తి ఆఫర్లు, డిస్కౌంట్లు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం..
పిక్సెల్ 11పై రూ.26వేల వరకు బెనిఫిట్స్ :
భారత మార్కెట్లో గూగుల్ పిక్సెల్ 11 ఫోన్ రూ.89,999 ప్రారంభ ధరతో లభిస్తుంది. దీపావళి సేల్‌లో 512GB వేరియంట్‌పై రూ.10వేల స్టోర్ డిస్కౌంట్ లభిస్తోంది. పాత ఫోన్లపై రూ.9వేల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా పొందవచ్చు. అంతేకాదు, ఎంపిక చేసిన ఈఎంఐ లావాదేవీలపై HDFC బ్యాంక్, ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డులతో రూ.7వేల వరకు ఇన్స్టంట్ క్యాష్‌బ్యాక్ అందిస్తోంది.
Read Also : BSNL Freedom 2.0 Offer : BSNL బంపరాఫర్.. జస్ట్ రూ.1కే 24GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్! ఆఫర్ మిస్ చేయొద్దు..!
ఈ ఆఫర్లన్నీ వర్తిస్తే.. పిక్సెల్ 11 ఫోన్ 512GB మోడల్‌పై మొత్తం రూ.26వేల వరకు బెనిఫిట్స్ పొందే అవకాశం ఉంది. అయితే, ఫైనల్ ధర కొనుగోలుదారుడి అర్హతలు, ఎక్స్ఛేంజ్ ఫోన్ వాల్యూపై ఆధారపడి ఉంటుంది.
పిక్సెల్ 11 ప్రో, ఫోల్డ్ పైనా డిస్కౌంట్లు :
ప్రీమియం ఫోన్లను కోరుకునేవారికి కూడా గూగుల్ ప్రత్యేక ఆఫర్లు అందిస్తోంది. పిక్సెల్ 11 ప్రో ధర రూ.1,19,999 కాగా, పిక్సెల్ 11 ప్రో ఎక్స్ఎల్ ధర రూ.1,34,999గా ఉంది. పిక్సెల్ 11 ప్రో ఫోల్డ్ ధర రూ.1,86,999కు లభిస్తుంది. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్ కలిపి పిక్సెల్ 9ను ఎక్స్ఛేంజ్ చేసే అర్హులైన కొనుగోలుదారులకు రూ.46వేల వరకు బెనిఫిట్స్ అందిస్తుంది.
పిక్సెల్ 10, వాచ్‌లపైనా ఆఫర్లు :
పాత మోడళ్లపై ఆసక్తి ఉన్నవారికి పిక్సెల్ 10 రూ.64వేల లోపు, పిక్సెల్ 10aను రూ.46వేల లోపు ధరకే సొంతం చేసుకోవచ్చు. అలాగే పిక్సెల్ వాచ్ 5పై రూ.2,500 వరకు, పిక్సెల్ వాచ్ 4పై రూ.1,500 వరకు బ్యాంక్ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి.
Note : ఈ ఆఫర్లు మోడల్, బ్యాంక్ కార్డు, ఎక్స్ఛేంజ్ ఫోన్, పేమెంట్ విధానం ఆధారంగా మారవచ్చు. కొనుగోలు చేసే ముందు గూగుల్ స్టోర్‌లో ఫైనల్ ధర, రూల్స్ తప్పనిసరిగా చెక్ చేయండి.
