Ante Sundaraniki: సినిమాకో వేరియేషన్.. నా టేస్టే వేరంటున్న నాని!

నాని.. అపరిచితుడు అనిపించుకుంటున్నాడు. సినిమా సినిమాకి వేరియేషన్ చూపిస్తూ నా టేస్ట్ వేరంటున్నాడు. టక్ జగదీష్ తర్వాత శ్యామ్ సింగ రాయ్.. ఇప్పుడు అంటే సుందరానికి ఆ తర్వాత దసరా..

Ante Sundaraniki: సినిమాకో వేరియేషన్.. నా టేస్టే వేరంటున్న నాని!

Ante Sundaraniki

Updated On : February 25, 2022 / 3:31 PM IST

Ante Sundaraniki: నాని.. అపరిచితుడు అనిపించుకుంటున్నాడు. సినిమా సినిమాకి వేరియేషన్ చూపిస్తూ నా టేస్ట్ వేరంటున్నాడు. టక్ జగదీష్ తర్వాత శ్యామ్ సింగ రాయ్.. ఇప్పుడు అంటే సుందరానికి ఆ తర్వాత దసరా.. ఇలా ఒక క్యారెక్టర్ తో మరో క్యారెక్టర్ కి అస్సలు సంబంధం లేకుండా సెట్ చేసుకుంటున్న నాని.. యాక్టింగ్ స్కిల్స్ తో రఫ్ఫాడిస్తున్నాడు.

Ante Sundaraniki: నానీ బర్త్ డే.. ఈ బుధవారం యువ సుందరుడు బర్త్‌డే హోమం!

ఇదీ నాని సరికొత్త యాక్టింగ్ వెర్షన్. సినిమా సినిమాకు కొత్త క్యారెక్టర్స్ వెతుక్కుంటున్న ఈ హీరో ఇప్పుడు సుందరంగా కనిపించి గిలిగింతలు పెట్టిస్తున్నాడు. నాని బర్త్ డే స్పెషల్ గా రిలీజైంది అంటే సుందరానికి స్పెషల్ టీజర్. నజ్రీయా నజీమ్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీని వివేక్ ఆత్రేయ డైరెక్ట్ చేస్తున్నాడు. ఆవకాయ సీజన్ అంటూ జూన్ 10న సుందరంగా రాబోతున్నాడు నాని.

Ante Sundaraniki: నాని సినిమాకి ఏడు రిలీజ్ డేట్స్.. పెద్ద చిక్కే!

పక్కింటి అబ్బాయిలా కనిపిస్తూ.. క్యారెక్టర్ వేరియేషన్స్ చూపించడం నాని ఫస్ట్ నుంచి చేస్తున్నదే. ఇప్పుడది పీక్స్ కు రీచయింది. నానిలోని అపరిచితుడిని పరిచయం చేస్తోంది. టక్ జగదీష్ తర్వాత శ్యామ్ సింగ రాయ్ గా పీరియాడికల్ లుక్ చూపించాడు. ఇప్పుడు సుందరంగా కామెడీ చేయబోతున్నాడు. ఆ తర్వాత దసరా సినిమాలో తెలంగాణ యువకుడిగా.. రగ్డ్ లుక్ లో.. మాస్ స్కిల్స్ తో అట్రాక్ట్ చేయాలనుకుంటున్నాడు. ఇలా రోటీన్ రోల్స్ కు బైబై చెప్పేసి.. తనలోని అపరిచితుడిని బయటికి తెస్తున్నాడు నాని.