Ante Sundaraniki: నానీ బర్త్ డే.. ఈ బుధవారం యువ సుందరుడు బర్త్‌డే హోమం!

నేచురల్ స్టార్ నానీ ఇప్పుడు తన కెరీర్ లో 28వ సినిమాగా ‘అంటే సుందరానికి’ అనే సినిమా చేస్తున్నాడు. పక్కా ఫన్ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది.

Ante Sundaraniki: నానీ బర్త్ డే.. ఈ బుధవారం యువ సుందరుడు బర్త్‌డే హోమం!

Ante Sundaraniki

Ante Sundaraniki: నేచురల్ స్టార్ నానీ ఇప్పుడు తన కెరీర్ లో 28వ సినిమాగా ‘అంటే సుందరానికి’ అనే సినిమా చేస్తున్నాడు. పక్కా ఫన్ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా లాంటి మంచి సినిమాలు అందించిన వివేక్ ఆత్రేయ ఈ సినిమాకి డైరెక్టర్ కాగా.. నజ్రియా నానీ సరసన హీరోయిన్. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లాంటి సంస్థ నిర్మిస్తుండడం కూడా ఈ సినిమా మీద మంచి అంచనాలే ఉన్నాయి.

Nani : నాని ‘దసరా’ మూవీ పూజా కార్యక్రమం

ఈ మధ్యనే ఈ ‘అంటే సుందరానికి’ సినిమాకి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు రిలీజ్ డేట్స్ ప్రకటించి మేకర్స్ అందరికీ షాక్ ఇచ్చారు. ఏప్రిల్ 22 , ఏప్రిల్ 29, మే 6, మే 20, మే 27, జూన్ 3, జూన్ 10 తేదీలలో ఒక రోజు ఈ సినిమా విడుదల కానుందని ఫన్నీగా ప్రకటించారు. అందులో ఏ ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారో ఇంకా ప్రకటించలేదు కానీ ముందుగా యువ సుందరుడికి బర్త్ డే హోమానికి మాత్రం ముహూర్తం పెట్టారు.

Nani 29: కొత్తగా నానీ క్యారెక్టర్.. క్రూరుడిగా కనిపించనున్న నేచురల్ స్టార్!

‘అంటే… మా యువ సుందరుడి పుట్టిన రోజు సందర్భంగా మేము జరుపుతున్న ఒక ‘Barthhday Homam’ ఫిబ్రవరి 23న సా||గం 4:05 ని||ల నుండి మొదలు’ కాబోతుంది అంటూ యూనిట్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. గురువారం నానీ పుట్టినరోజు కాగా.. బుధవారం నుండే ఇలా బర్త్ డే హోమంతో సెలబ్రేట్ చేస్తున్నట్లు ఇలా ఫన్నీగా ప్రకటించారు. అంటే సుందరానికి టీమ్ తొలి నుండి అన్నీ ఇలాగే ఫన్నీగా అనౌన్స్ చేస్తూ ప్రేక్షకులలో అటెన్షన్ క్రియేట్ చేస్తున్నారు.