Nani 29: కొత్తగా నానీ క్యారెక్టర్.. క్రూరుడిగా కనిపించనున్న నేచురల్ స్టార్!

నేచురల్ స్టార్ నానీ.. అంటే సుందరానికీ, దసరా సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. నానీ కెరీర్ లో 29వ సినిమాగా వస్తున్న దసరా సినిమాకి సంబంధించి క్రేజీ అప్డేట్..

Nani 29: కొత్తగా నానీ క్యారెక్టర్.. క్రూరుడిగా కనిపించనున్న నేచురల్ స్టార్!

Nani 29

Nani 29: నేచురల్ స్టార్ నానీ ప్రస్తుతం శ్యామ్ సింగరాయ్ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నాడు. సౌత్ అన్ని బాషలలో విడుదలైన శ్యామ్ సింగరాయ్ వ్యతిరేక పరిస్థితులలో కూడా నానీని మరో మెట్టు ఎక్కించి సక్సెస్ అందించింది. ఇక నానీకి సంబంధించి ప్రస్తుతం రెండు సినిమాలు సెట్స్ మీదున్నాయి. అంటే సుందరానికీ, దసరా సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. కాగా నానీ కెరీర్ లో 29వ సినిమాగా వస్తున్న దసరా సినిమాకి సంబంధించి క్రేజీ అప్డేట్ ఒకటి ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారుతుంది.

Telugu Dubbing Films: బాలీవుడ్ స్క్రీన్స్‌పై తెలుగు డబ్బింగ్ సినిమాల దాడి!

శ్రీకాంత్ ఓదెల అనే యువకుడు ఈసినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతుండగా ఇప్పటికే విడుదలైన నానీ ఊరమాస్ లుక్ అటెన్షన్ క్రియేట్ చేసింది. కాగా.. ఈ సినిమాలో నానీ క్రూరమైన పాత్రలో కనిపించనున్నాడట. కీర్తి సురేశ్ ఈ సినిమాలో కథానాయికగా నటిస్తుండగా.. ఈ సినిమాలో ప్రేమ, రొమాన్స్ కు చోటు లేదని చెప్తున్నారు. పక్కా విలన్ పాత్రలో నానీ దసరా సినిమాలో సరికొత్తగా కనిపించనున్నట్లు తెలుస్తుంది. ఫస్ట్ టైమ్ నానీ తెలంగాణ యాసలో ఫుల్ లెంత్ రోల్ చేయడం కూడా విశేషం.

Apsara Rani: కోరిక తీరిస్తేనే ఛాన్స్.. క్యాస్టింగ్ కౌచ్‌పై అప్సర!

నాని నెగటివ్ పాత్రలో కనిపించడం కొత్తేమీ కాదు. గతంలో జెంటిల్‌మన్‌, వి వంటి సినిమాల్లో నెగెటివ్‌ క్యారెక్టర్‌లో నటించి ప్రేక్షకులను అలరించాడు. ఇప్పుడు మరోసారి నెగటివ్ గా మారనున్నాడట. ఇందుకోసం ఇప్పటికే నాని తన లుక్‌ పై జాగ్రత్తలు తీసుకుంటుండగా.. బొగ్గుగని బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ కథపై దర్శకుడు శ్రీకాంత్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడట. సత్యన్ సూర్యన్ కెమెరా హ్యాండిల్ చేస్తున్న ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. మరి శ్రీకాంత్ నానీ ఎలా చూపిస్తాడో చూడాల్సి ఉంది.