Telugu Dubbing Films: బాలీవుడ్ స్క్రీన్స్‌పై తెలుగు డబ్బింగ్ సినిమాల దాడి!

ఇంతకు ముందు వరకు పేరున్న హీరోల తమిళ్ డబ్బింగ్ సినిమాల హవా ఎక్కువగా టాలీవుడ్ లో కనిపిస్తుండేది. త్వరలో పేరున్న హీరోలు కాదు పాన్ ఇండియా స్టార్స్ డబ్బింగ్ జోరు బాలీవుడ్ లో..

Telugu Dubbing Films: బాలీవుడ్ స్క్రీన్స్‌పై తెలుగు డబ్బింగ్ సినిమాల దాడి!

Telugu Dubbing Films

Telugu Dubbing Films: ఇంతకు ముందు వరకు పేరున్న హీరోల తమిళ్ డబ్బింగ్ సినిమాల హవా ఎక్కువగా టాలీవుడ్ లో కనిపిస్తుండేది. త్వరలో పేరున్న హీరోలు కాదు పాన్ ఇండియా స్టార్స్ డబ్బింగ్ జోరు బాలీవుడ్ లో కనపించబోతుంది. అవును తెలుగు స్టార్ హీరోల సినిమాలిప్పుడు బాలీవుడ్ స్క్రీన్స్ పై దాడి చేసేందుకు రెడీ అవుతున్నాయి. పుష్ప తర్వాత బన్నీ ఈ ప్రోగ్రామ్ ను అఫీషియల్ గా లాంచ్ చేస్తున్నారు.

Bangarraju: అక్కినేని హీరోలకు బంగారు బాతుగా సంక్రాంతి!

తెలుగులో ఇతర ఇండస్ట్రీ హీరోల సినిమా ఒక్కటి హిట్టయిచతే చాలు.. ఆ తర్వాత వాళ్లు నటించిన పాత సినిమాలను డబ్ చేసి రిలీజ్ చేస్తుండటం మనం చూసేదే. అల్లు అర్జున్ విషయంలో హిందీ నిర్మాతలు సేమ్ ఫార్ములాను ఫాలో అవుతున్నారు. ‘పుష్ప’తో ఐకాన్ స్టార్ హిందీ సినిమా రికార్డులను బద్దలు కొట్టారు. పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్నారు. నార్త్ ఆడియన్స్ పుష్ప హిందీ వర్షన్ కు 100 కోట్లను ఈజీగా తెచ్చేయడంతో బన్నీ సినిమాలపై క్రేజ్ పెరిగింది. అందులో బాగంగానే ఇప్పుడు అల్లు అర్జున్ ‘అల.. వైకుంఠపురములో’ సినిమాను హిందీలో డబ్బింగ్ చేసి జనవరి 26న విడుదల చేస్తున్నారు.

NTR 30: తారక్ జోడీగా నేషనల్ క్రష్.. రష్మిక ఖాతాలో మరో క్రేజీ ఆఫర్!

‘అల వైకుంఠంపురములో’ సినిమాను హిందీలో ‘షెహజాదే’ పేరుతో రీమేక్ చేస్తున్నారు. అల్లు అర్జున్ రోల్ లో కార్తీక్ ఆర్యన్, పూజా హెగ్డే క్యారెక్టర్ కృతి సనన్ చేస్తున్నారు. ఆ సినిమా నిర్మాతల్లో అల్లు అరవింద్ కూడా ఉన్నారు. అయినా సరే బన్నీ అల వైకుంఠపురాన్ని అక్కడ చూపించాలనుకోవడం విశేషమే. ఇప్పటికిప్పుడు బన్నీ క్రేజ్ ను క్యాష్ చేసుకోవాలంటే ఇలాంటి పనులు చేయాల్సిందే కదా. ఆల్రెడీ బన్నీ బ్రాండ్ ను వాడుకుంటూ దేశముదురు లాంటి పాత సినిమాలను బీహార్ లాంటి రాష్ట్రాల్లో ఆడించేస్తున్నారు. సో ఇప్పుడు అఫీషియల్ గా త్రివిక్రమ్ – బన్నీ సినిమా డబ్బింగ్ రేస్ లో దూకుతోంది.

Ala Vaikunthapurramuloo: పుష్ప ఇచ్చిన జోష్.. హిందీలో బన్నీ సినిమా!

అటు ట్రిపుల్ ఆర్ స్టార్ రామ్ చరణ్ రంగస్థలం కూడా డబ్బింగ్ కి రెడీ అవుతోంది. అల వైకుంఠపురం సినిమా డబ్బింగ్ రైట్స్ దక్కించుకున్న గోల్డ్ మైన్స్ ప్రొడక్షన్ హౌజ్ రంగస్థలాన్ని హిందీలోకి మారుస్తోంది. రిలీజ్ మాత్రం ట్రిపుల్ ఆర్ తర్వాతే కానుంది. బాహుబలి తర్వాత వచ్చిన ఇమేజ్ తో ఈ డబ్బింగ్ ఫీట్ మాత్రం సాధించలేదు ప్రభాస్. సాహోతో డైరెక్ట్ గానే ఎంట్రీ ఇచ్చారు. అయితే ఇంతకుముందు తెలుగు హీరోల హిందీ డబ్బింగ్ సినిమాలు టీవీల్లో, యూట్యూబుల్లో బాగానే సందడి చేశాయి. అలా ఇక్కడి స్టార్స్ పరిచయమున్నారు కాబట్టే థియేటర్స్ లో బాగా రిసీన్ చేసుకుంటున్నారు నార్త్ ఆడియెన్స్. ఇప్పుడు వాళ్లని డబ్బింగ్ సినిమాలతో థియేటర్స్ కి తీసుకురావాలన్నదే మేకర్స్ టార్గెట్.