Bangarraju: అక్కినేని హీరోలకు బంగారు బాతుగా సంక్రాంతి!

పెద్ద పండక్కి పెద్ద లెక్కలే చూపిస్తున్నాడు బంగార్రాజు. బరిలో భారీ సినిమాలు లేకపోవడంతో కలెక్షన్స్ బాగానే రాబడుతున్నాడు. అక్కినేని హీరోలు టార్గెట్ చేసింది తెలుగు రాష్ట్రాలనే.

Bangarraju: అక్కినేని హీరోలకు బంగారు బాతుగా సంక్రాంతి!

Bangarraju

Bangarraju: పెద్ద పండక్కి పెద్ద లెక్కలే చూపిస్తున్నాడు బంగార్రాజు. బరిలో భారీ సినిమాలు లేకపోవడంతో కలెక్షన్స్ బాగానే రాబడుతున్నాడు. అక్కినేని హీరోలు టార్గెట్ చేసింది తెలుగు రాష్ట్రాలనే. అయినా సరే అదిరిపోయే రికార్డులు సృష్టిస్తూ బంగారు బాతుగా ఎదుగుతున్నాడు బంగార్రాజు. పోటీకి మరే సినిమా లేకపోవడం.. సంక్రాంతి సినిమా అంటే అక్కినేని హీరోలు మాత్రమే కనిపించడం బంగార్రాజు సినిమాకి బాగా కలిసొచ్చింది.

NTR 30: తారక్ జోడీగా నేషనల్ క్రష్.. రష్మిక ఖాతాలో మరో క్రేజీ ఆఫర్!

కొవిడ్ భయానికి పాన్ ఇండియా సినిమాలు సంక్రాంతి రేస్ నుంచి తప్పుకుంటే.. నేనున్నానంటూ ప్రేక్షకుల ముందుకొచ్చాడు బంగార్రాజు. పోటీ పెద్దగా లేదు.. బరిలో పెద్ద స్టార్స్ లేరు.. సో అక్కినేని హీరోలు హవా కొనసాగిస్తున్నారు. సంక్రాంతి అంటేనే ఫ్యామిలీతో సహా ఆడియెన్స్ ను థియేటర్స్ కి తీసుకొచ్చే పండుగ. అందుకే ఉన్న ఒక్క ఆప్షన్ ను వదులుకోలేక బంగార్రాజు బాటపడుతున్నారు ప్రేక్షకులు.

Ala Vaikunthapurramuloo: పుష్ప ఇచ్చిన జోష్.. హిందీలో బన్నీ సినిమా!

ఫస్ట్ డే దాదాపు 10 కోట్లు కలెక్ట్ చేసింది బంగార్రాజు. రెండో రోజు దాన్ని మించేసింది. రిలీజైన కేవలం రెండు రోజుల్లో 36 కోట్ల గ్రాస్ సాధించి 19 కోట్ల షేర్ ను కొల్లగొట్టారు అక్కినేని స్టార్స్. ఇక ఆదివారాన్ని కలుపుకుని మూడు రోజుల కలెక్షన్ ముచ్చటగా 53 కోట్ల గ్రాస్ ను క్రాస్ చేసింది. తెలుగు రాష్ట్రాలతో సహా కర్ణాటక, ఓవర్సీస్ లో సైతం దూకుడు చూపిస్తున్నాడు బంగార్రాజు. 39 కోట్ల లక్ష్యంతో సంక్రాంతి బరిలోకొచ్చిన బంగార్రాజు మేజర్ షేర్ ను కేవలం మూడు రోజుల్లోనే సాధించాడు.

RGV : అల్లు అర్జున్ పై ఆర్జీవీ ట్వీట్.. కొత్త మెగాస్టార్ అంటూ..

వైరస్ వెంటాడుతున్న సంక్రాంతి సీజన్ నమ్ముకున్నాడు నాగార్జున. కేవలం 3 నెలల్లో సోగ్గాడే చిన్ని నాయన సీక్వెల్ ను పూర్తి చేసేశాడు డైరెక్టర్ కల్యాణ్ కృష్ణ. నాగ్ కాంబినేషన్ లో చై నటించడం.. చైకి జోడీగా కృతిశెట్టి కనిపించడం.. ఫరియా అబ్దుల్లా లాంటి హీరోయిన్స్ తో అట్రాక్ట్ చేయడం కలిసొచ్చింది సోగ్గాళ్లకి. గతంలో సంక్రాంతికి ఒక్క సోగ్గాడే సందడి చేస్తే.. ఈసారి సేమ్ ఫ్లేవర్ తో తండ్రీకొడుకలు హుషారెత్తించి మొత్తానికి సంక్రాంతి కింగ్స్ అనిపించుకుంటున్నారు.