Apsara Rani: కోరిక తీరిస్తేనే ఛాన్స్.. క్యాస్టింగ్ కౌచ్‌పై అప్సర!

సినిమా పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ గురించి ఇప్పటికే చాలామంది హీరోయిన్స్ ఓపెన్ గానే చెప్పేసిన సంగతి తెలిసిందే. ప్రతి రంగంలో క్యాస్టింగ్ కౌచ్ ఉంటుందని.. అది సినీ పరిశ్రమలో అధికంగా..

Apsara Rani: కోరిక తీరిస్తేనే ఛాన్స్.. క్యాస్టింగ్ కౌచ్‌పై అప్సర!

Apsara Rani(Image:Instagram)

Apsara Rani: సినిమా పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ గురించి ఇప్పటికే చాలామంది హీరోయిన్స్ ఓపెన్ గానే చెప్పేసిన సంగతి తెలిసిందే. ప్రతి రంగంలో క్యాస్టింగ్ కౌచ్ ఉంటుందని.. అది సినీ పరిశ్రమలో అధికంగా ఉంటుందని ఇండస్ట్రీకి చెందిన వారే ఒప్పేసుకున్న కామెంట్స్ కూడా ఉండనే ఉన్నాయి. ఆర్జీవీ హీరోయిన్ గా క్రేజ్ దక్కించుకున్న అప్సర రాణి ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో హాట్ బ్యూటీ. ఆమె అందాలను తెగ పొగిడేస్తూ ఆమెతో పార్టీలు, డిస్కోలకు వెళ్తూ ముద్దులు, హగ్‌లతో వర్మ రెచ్చిపోవడంతో ఈ అమ్మడి ఫేట్ మారిపోయింది.

Films Release Crash: కోవిడ్ క్రాష్.. సరిచేసే పనిలో టాలీవుడ్ మేకర్స్

తనను ఇంకా సెక్సీగా కావాలని వర్మ చెప్పినట్టు అప్పట్లోనే బోల్డ్ కామెంట్స్ చేసిన ఒరిస్సా పాప అప్సర రాణి తనకు జరిగిన ఓ క్యాస్టింగ్ కౌచ్ సంఘటన గురించి చెప్పుకొచ్చింది. తనకు తెలుగు ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనుభవం ఎదురుకాలేదని.. ఇక్కడ ఎవరూ ఇబ్బంది పెట్టలేదని చెప్పిన అప్సర కన్నడలో మాత్రం క్యాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని చూశానని చెప్పింది. కన్నడలో ఒక ఫిల్మ్‌ ఆఫర్ చేయగానే లగేజ్ తీసుకుని మా ఫాదర్‌తో కలిసి వెళ్లానని.. వాళ్లు నా లగేజ్, మా నాన్నిని చూసి.. మిమ్మల్ని ఒంటరిగా రమ్మని పిలిచాం కదా.. ఇందంతా ఏంటి అని అడిగారట.

Bangarraju: అక్కినేని హీరోలకు బంగారు బాతుగా సంక్రాంతి!

ఈ సినిమా అఫర్ ఇచ్చిన దర్శకుడు తన కోరిక తీరిస్తేనే ఛాన్స్ ఇస్తానని.. మీ నాన్న లేకుండా ఒంటరిగా రావాలని కోరాడట. మ్యాటర్ నాకు అర్థమై ఒక దండం పెట్టి అక్కడ నుంచి వచ్చేశామని.. ఒకరకంగా మా నాన్న గారు నేను అక్కడ నుంచి పారిపోయి వచ్చేశామని చెప్పింది. అలా నేనూ క్యాస్టింగ్ కౌచ్ ఎక్స్ పీరియన్స్ ఎదుర్కొన్నా అంటూ చెప్పుకొచ్చింది వర్మ హీరోయిన్ అప్సర రాణి. వర్మ థ్రిల్లర్ సినిమాతో హీరోయిన్ గా మారిన అప్సరతో ప్రస్తుతం డేంజరస్ అనే సినిమా కూడా తీస్తున్నాడు. ఇక క్రాక్ సినిమాలో ఐటెం సాంగ్ చేసిన అప్సర గోపీచంద్ సీటిమార్ లో పెప్సీ ఆంటీ ఐటెం సాంగ్ లో అదరగొట్టింది.