AnthaIshtam: అంత ఇష్టం ఏందయ్యా నీకు.. భీమ్లా నుండి ఫీల్ గుడ్ మెలోడీ!

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, దగ్గుబాటి రానా హీరోలుగా తెరకెక్కుతున్న మల్టీస్టారర్ సినిమా భీమ్లా నాయక్. ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన టీజర్లు, పోస్టర్లు దుమ్ముదులిపేయగా ఫస్ట్ సింగల్..

AnthaIshtam: అంత ఇష్టం ఏందయ్యా నీకు.. భీమ్లా నుండి ఫీల్ గుడ్ మెలోడీ!

Anthaishtam

AnthaIshtam: పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, దగ్గుబాటి రానా హీరోలుగా తెరకెక్కుతున్న మల్టీస్టారర్ సినిమా భీమ్లా నాయక్. ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన టీజర్లు, పోస్టర్లు దుమ్ముదులిపేయగా ఫస్ట్ సింగల్ థీమ్ సాంగ్ అభిమానులకు సూపర్ కిక్ ఇచ్చింది. కాగా, ఇప్పుడు ఈ మూవీ నుంచి మరో సాంగ్ వచ్చేసింది. అంత ఇష్టం ఏందయ్యా.. అంత ఇష్టం ఏందయ్యా నీకు.. నామీద అనే సాంగ్ ను యూనిట్ రిలీజ్ చేసింది.

Annaatthe: టైటిల్ కన్ఫర్మ్.. ‘పెద్దన్న’గా తలైవర్!

ఇప్పుడు ఈ పాట అభిమానులతో పాటు సంగీత అభిమానులను కూడా విశేషంగా ఆకట్టుకుంటుంది. వినడానికి వినసొంపుగా.. భార్యకి భర్తపై ఉన్న ప్రేమని తెలియజేసేలా అంతకి మించిన సాహిత్యంతో వచ్చిన ఈ పాట ఇప్పుడు యూట్యూబ్ లో దూసుకుపోతుంది. మలయాళంలో సూపర్ హిట్‌ అయిన అయ్యప్పనుమ్ కోషియుమ్‌కు తెలుగు రీమేక్‌గా భీమ్లా నాయక్‌ను రూపొందిస్తున్నారు.

Sai Dharam Tej : మెగా ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్‌.. ‘సాయి ధరమ్ తేజ్’ డిశ్చార్

ఈ మూవీని సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. నిత్యా మీనన్, సంయుక్త మీనన్ ఇందులో హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. భీమ్లా నాయక్ మూవీకి మాటల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తుండగా.. సాగర్ కె చంద్ర ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. పవన్‌ కళ్యాణ్‌ రీఎంట్రీ తర్వాత ఇటీవలే వకీల్ సాబ్ సినిమాతో సక్సెస్ అందుకోగా పవన్.. ఈ సినిమాతో మరో భారీ హిట్ ఖాతాలో వేసుకుంటాడని అభిమానులు బల్లగుద్ది చెప్తున్నారు.