Sai Dharam Tej : మెగా ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ‘సాయి ధరమ్ తేజ్’ డిశ్చార్
వినాయక చవితినాడు ప్రమాదానికి గురై 35 రోజులుగా ఆసుపత్రికి పరిమితమైన సాయి ధరమ్ తేజ్ పూర్తి ఆరోగ్యంతో ఇంటికి చేరారు.

Sai Dharam Tej
Sai Dharam Tej : వినాయక చవితినాడు ప్రమాదానికి గురై 35 రోజులుగా ఆసుపత్రికి పరిమితమైన సాయి ధరమ్ తేజ్ పూర్తి ఆరోగ్యంతో ఇంటికి చేరారు. విజయదశమితోపాటు పుట్టినరోజు నాదే సాయి ధరమ్ తేజ్ ఇంటికి రావడంతో మెగా ఫ్యామిలీ సెలెబ్రేషన్స్ లో మునిగిపోయింది. సాయి ధరమ్ తేజ్ పూర్తిగా కోలుకొని ఇంటికి వచ్చినట్లు మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. పునర్జన్మనెత్తిన ధరమ్ తేజ్ కు మేనమామ అత్త తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు.
చదవండి : అదిరిపోయే ఓపెనింగ్స్ సాధించిన సాయి ధరమ్ తేజ్ సినిమాలు..
కాగా వినాయకచవితి నాడు జూబ్లీహిల్స్ కేబుల్ బ్రిడ్జి సమీపంలో సాయి ధరమ్ తేజ్ బైక్ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో అతడికి తీవ్ర గాయాలు అయ్యాయి. కాలర్ బోన్ కి గాయం కావడంతో శస్త్రచికిత్స చేశారు వైద్యులు.. 35 రోజులపాటు వైద్యుల పర్యవేక్షణలో ఉన్న సాయి ధరమ్ తేజ్ పూర్తి ఆరోగ్యంతో ఇంటికి చేరుకున్నారు.
చదవండి : యాక్సిడెంట్ కేసు.. రూ.లక్ష ఫైన్ వేసిన జీహెచ్ఎంసీ