Anupama Parameswaran : నా ఇబ్బంది మీరు అర్ధం చేసుకోవాలి.. కార్తికేయ 2 ప్రమోషన్స్ లో అందుకే పాల్గొనట్లేదు..

అనుపమ ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసిన పోస్ట్ లో.. ''అందరికి నేను ఓ విషయంలో స్పష్టత ఇవ్వాలని అనుకుంటున్నాను. నేను వేరే సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉన్నాను. రాత్రి పగలు ఖాళీగా లేకుండా ఒకేసారి రెండు సినిమాల షూటింగ్స్ లో.........

Anupama Parameswaran : నా ఇబ్బంది మీరు అర్ధం చేసుకోవాలి.. కార్తికేయ 2 ప్రమోషన్స్ లో అందుకే పాల్గొనట్లేదు..

Karthikeya

Karthikeya 2 : నిఖిల్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో గతంలో వచ్చిన కార్తికేయ సినిమాకి ఎనిమిదేళ్ల తర్వాత సీక్వెల్ గా కార్తికేయ 2 రాబోతుంది. ఈ సారి సినిమాని మరింత కొత్త కథతో, మరింత సస్పెన్స్ గా తెరకెక్కించినట్టు తెలుస్తుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన సినిమా ట్రైలర్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పలు సార్లు వాయిదా పడ్డ ఈ సినిమా ఆగస్టు 12న రిలీజ్ కాబోతుంది. దీంతో ప్రమోషన్స్ జోరుగా చేస్తున్నారు చిత్ర యూనిట్. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది.

అయితే కార్తికేయ 2 సినిమా ప్రమోషన్స్ లో అనుపమ కనిపించకపోవడంతో పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా అనుపమ దీనిపై క్లారిటీ ఇచ్చేందుకు తన ఇన్‌స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ పెట్టింది. తను ఎందుకు కార్తికేయ 2 సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనట్లేదో తెలిపింది.

Karthikeya 2 : నా సినిమాని రిలీజ్ అవ్వకుండా అడ్డుకుంటున్నారు.. నిఖిల్ ఆవేదన..

అనుపమ ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసిన పోస్ట్ లో.. ”అందరికి నేను ఓ విషయంలో స్పష్టత ఇవ్వాలని అనుకుంటున్నాను. నేను వేరే సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉన్నాను. రాత్రి పగలు ఖాళీగా లేకుండా ఒకేసారి రెండు సినిమాల షూటింగ్స్ లో పాల్గొంటున్నాను. ఇక్కడ వేరే ఆర్టిస్టులతో నాకు కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి. అందుకనే షూట్స్ తో బిజీ ఉండటం వల్లే నేను కార్తికేయ 2 ప్రమోషన్స్ కి హాజరు కాలేకపోతున్నాను. కార్తికేయ 2 సినిమా రిలీజ్ డేట్స్ లో మార్పులు జరిగాయి కాబట్టి నా డేట్స్ అడ్జస్ట్ అవ్వలేదు. నా ఇబ్బందిని మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. కార్తికేయ 2 యూనిట్ కి ఆల్ ది బెస్ట్. ముఖ్యంగా హీరో నిఖిల్ ఈ సినిమా కోసం ఎక్కువ కష్టపడుతున్నాడు” అని తెలిపింది.