Anupama Parameswaran : ఆ నంబర్ నాది కాదు.. నా పేరు వాడుకొని మోసం చేస్తున్నారు..

ఇటీవల కొంతమంది సెలబ్రిటీల పేర్లు వాడుకొని మరీ ఈ మోసాలు చేస్తున్నారు. జనాల దగ్గర డబ్బులు అడగడం వంటివి కూడా చేస్తున్నారు. తాజాగా అనుపమ పరమేశ్వరన్ పేరుతో ఓ వ్యక్తి మోసానికి...........

Anupama Parameswaran : ఆ నంబర్ నాది కాదు.. నా పేరు వాడుకొని మోసం చేస్తున్నారు..

Anupama (2)

Anupama Parameswaran :  ‘ప్రేమమ్‌’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్‌ అడపాదడపా సినిమాలు చేస్తూనే అభిమానులని మాత్రం బాగా సంపాదించుకుంది. తన సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటూ కొత్త కొత్త ఫొటోలతో పాటు తనకి సంబంధించిన విశేషాలని అభిమానులతో షేర్ చేసుకుంటుంది. ఇటీవలే ‘రౌడీ బాయ్స్‌’ సినిమాతో తెలుగు ప్రేక్షకులని అలరించింది. ఇందులో లిప్ లాక్ సీన్స్, రొమాన్స్ సీన్స్ తో ఘాటుగా రెచ్చిపోయింది. తాజాగా అనుపమ ఓ పోస్ట్ ని తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది.

 

ఈమద్య కాలంలో టెక్నాలజీని వాడుకొని మోసాలు చేసేవారు ఎక్కువ అయ్యారు. ప్రపంచంలో ఏ మూల ఉన్నా టెక్నాలజీని వాడుకొని జనాల్ని మోసం చేస్తున్నారు. ఇటీవల కొంతమంది సెలబ్రిటీల పేర్లు వాడుకొని మరీ ఈ మోసాలు చేస్తున్నారు. జనాల దగ్గర డబ్బులు అడగడం వంటివి కూడా చేస్తున్నారు. తాజాగా అనుపమ పరమేశ్వరన్ పేరుతో ఓ వ్యక్తి మోసానికి పాల్పడుతున్నట్టు తెలిసింది. నేను అనుపమ పరమేశ్వరన్ ను అంటూ ఒక అమెరికన్ నెంబర్ నుండి మెసేజ్ లు వస్తున్నాయట. ఆ నెంబర్ నుండి కాల్స్ మరియు మెసేజ్ లు వస్తున్న నేపథ్యంలో కొందరు ఇప్పటికే మోసపోయారంట. ఈ విషయం అనుపమ వరకు చేరడంతో ఇంస్టాగ్రామ్ లో దీని గురించి స్టోరీ షేర్ చేసింది.

Abhishekam : దాసరి నారాయణరావు నిర్మాణం.. 4000 ఎపిసోడ్లతో పూర్తవుతున్న ‘అభిషేకం’

ఇంస్టాగ్రామ్ స్టోరీలో ఓ అమెరికన్ నెంబర్ షేర్ చేసి ఈ నెంబర్ నుండి వచ్చే మెసేజ్ లు కాని కాల్స్ కి కాని నాకు ఎటువంటి సంబంధం లేదు. ఆ నెంబర్ నాది కాదు. ఈ నెంబర్ నాకు తెలిసిన వాళ్ళది కూడా కాదు. ఆ నెంబర్ ను కొందరు నాది అని నమ్మి మోసపోయినట్లుగా నా దృష్టికి వచ్చింది. ఇలాంటి నెంబర్ ల నుండి నా పేరు చెప్పి మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఇలాంటి నంబర్స్ నుంచి వచ్చే మెసేజెస్, కాల్స్ కి రిప్లై ఇవ్వొద్దు అని పోస్ట్ చేసింది.