Anushka : ‘అరుంధతి’ సినిమాపై అనుష్క ఎమోషనల్ పోస్ట్

'అరుంధతి' సినిమా గురించి.. ''ఏ నటికైనా ఇలాంటి అవకాశం జీవితంలో ఒక్కసారే వస్తుంది. అరుంధతి సినిమాలోని జేజమ్మ పాత్ర నా జీవితంలో అలాంటిదే. నాకు ఇలాంటి మంచి అవకాశం ఇచ్చిన.......

Anushka : ‘అరుంధతి’ సినిమాపై అనుష్క ఎమోషనల్ పోస్ట్

Arundhathi

Arundhathi :  టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి కెరీర్‌లో గుర్తిండిపోయే సినిమా “అరుంధతి”. కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అనుష్క తన నటనతో అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఈ సినిమాతో అనుష్క స్టార్ హీరోయిన్ గా మారడమే కాక మళ్ళీ లేడీ ఓరియెంటెడ్ సినిమాలకి ప్రాణమిచ్చింది. అంతే కాక చాలా మంది హీరోలకి కూడా సాధ్యం కాని రికార్డులని అనుష్క ఈ సినిమాతో సాధించింది. స్టార్ హీరోలు లేకుండానే 15 కోట్ల బడ్జెట్ తో దాదాపు 70 కోట్ల కలెక్షన్స్ సాధించింది అనుష్క. ఈ సినిమా విడుదలై ఇటీవల 13 సంవత్సరాలు పూర్తి అయ్యింది. ఈ నేపథ్యంలో ‘అరుంధతి’ సినిమాని గుర్తు చేసుకుంటూ అనుష్క ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.

Sahithi : శేఖర్ మాస్టర్ కూతురి ఫేక్ ఐడీలకి చెక్.. అఫిషియల్ ఖాతాకు ఒక్కరోజులో 20 వేల మంది ఫాలోవర్స్

‘అరుంధతి’ సినిమా గురించి.. ”ఏ నటికైనా ఇలాంటి అవకాశం జీవితంలో ఒక్కసారే వస్తుంది. అరుంధతి సినిమాలోని జేజమ్మ పాత్ర నా జీవితంలో అలాంటిదే. నాకు ఇలాంటి మంచి అవకాశం ఇచ్చిన కోడి రామకృష్ణ గారికి, శ్యామ్ ప్రసాద్ రెడ్డిగారికి, అరుంధతి టీమ్ మొత్తానికి ధన్యవాదాలు. ఈ సినిమాకు ప్రేక్షకులు అందించిన సపోర్ట్ మర్చిపోలేనిదని, ప్రేక్షకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు” అని పోస్ట్ చేసింది.