Anushka: రేపే అనుష్క 48వ చిత్ర టైటిల్ అనౌన్స్‌మెంట్.. క్లారిటీ ఇచ్చేసిన జాతిరత్నం!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి ఇటీవల సినిమాలను చాలా నెమ్మదిగా చేస్తుండటంతో అభిమానులు ఆమె సినిమాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా, అనుష్క ప్రస్తుతం నటిస్తున్న 48వ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాలో అనుష్క ఓ సరికొత్త పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి కూడా నటిస్తుండటంతో ఈ కాంబినేషన్‌పై చిత్ర వర్గాల్లోనూ అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి.

Anushka: రేపే అనుష్క 48వ చిత్ర టైటిల్ అనౌన్స్‌మెంట్.. క్లారిటీ ఇచ్చేసిన జాతిరత్నం!

Anushka Shetty 48th Movie Title Announcement Tomorrow

Anushka: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి ఇటీవల సినిమాలను చాలా నెమ్మదిగా చేస్తుండటంతో అభిమానులు ఆమె సినిమాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా, అనుష్క ప్రస్తుతం నటిస్తున్న 48వ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాలో అనుష్క ఓ సరికొత్త పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి కూడా నటిస్తుండటంతో ఈ కాంబినేషన్‌పై చిత్ర వర్గాల్లోనూ అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి.

Anushka Shetty: నెక్ట్స్ మూవీ షూటింగ్‌లో జాయిన్ అయిన అనుష్క

కాగా, ఈ సినిమాను దర్శకుడు పి.మహేష్ డైరెక్ట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా నుండి ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో అభిమానులు ఈ సినిమా నుండి ఏదైనా అప్డేట్ ఇస్తే బాగుంటుందని ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ అనౌన్స్‌మెంట్ గురించి హీరో నవీన్ పోలిశెట్టి ఓ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా టైటిల్ ఏంటి అంటూ ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది చిత్ర యూనిట్.

Anushka: “కాంతారా”పై మనసు పారేసుకున్న స్వీటీ..

ఇక ఈ సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్‌ను రేపు(మార్చి 1న) చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ అనౌన్స్ చేయడంతో ప్రేక్షకులు ఈ సినిమాకు ఎలాంటి టైటిల్‌ను పెడతారా అని ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాను యువీ క్రియేషన్స్ బ్యానర్ ప్రొడ్యూస్ చేస్తుండగా, ఈ సినిమాలో అనుష్క ఓ చెఫ్ పాత్రలో నటిస్తోంది. రాడాన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకు నీరవ్ షా సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.