Anushka Shetty: నెక్ట్స్ మూవీ షూటింగ్‌లో జాయిన్ అయిన అనుష్క

టాలీవుడ్ స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి సినిమా వచ్చి చాలా కాలం అవుతోంది. ఆమె నటించిన లాస్ట్ మూవీ ‘నిశ్శబ్దం’ 2020లో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఆ సినిమా తరువాత అనుష్క తన నెక్ట్స్ మూవీని ఇప్పటివరకు తెరకెక్కించలేదు. అయితే అప్పట్లో ఓ సినిమా కోసం అనుష్క భారీగా బరువు పెరగడంతో, ఆమె తన వెయిట్‌ను తగ్గించేందుకే ఇంతకాలం సినిమాలకు బ్రేక్ తీసుకున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపించింది.

Anushka Shetty: నెక్ట్స్ మూవీ షూటింగ్‌లో జాయిన్ అయిన అనుష్క

Anushka Shetty Joins Shooting Of Her Next Movie

Anushka Shetty: టాలీవుడ్ స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి సినిమా వచ్చి చాలా కాలం అవుతోంది. ఆమె నటించిన లాస్ట్ మూవీ ‘నిశ్శబ్దం’ 2020లో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఆ సినిమా తరువాత అనుష్క తన నెక్ట్స్ మూవీని ఇప్పటివరకు తెరకెక్కించలేదు. అయితే అప్పట్లో ఓ సినిమా కోసం అనుష్క భారీగా బరువు పెరగడంతో, ఆమె తన వెయిట్‌ను తగ్గించేందుకే ఇంతకాలం సినిమాలకు బ్రేక్ తీసుకున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపించింది.

Anushka Shetty: జాతిరత్నం కోసం చెఫ్‌గా మారిన స్వీటీ..!

అయితే ‘జాతిరత్నాలు’తో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే హిట్ అందుకున్న యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి నటిస్తున్న తాజా చిత్రంలో అనుష్క హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఇటీవల స్టార్ట్ కూడా చేశారు. యువీ క్రియేషన్స్ బ్యానర్ ఈ సినిమాను తెరకెక్కిస్తుండటంతో అనుష్క ఈ సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక ఈ సినిమా షూటింగ్‌లో తాజాగా అనుష్క జాయిన్ అయినట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

Anushka Shetty : 17 ఇయర్స్ ఇండస్ట్రీ.. ఎట్టకేలకు నెక్స్ట్ సినిమా షూట్ మొదలు పెట్టిన అనుష్క..

అనుష్క కెరీర్‌లో 48వ చిత్రంగా రాబోతున్న ఈ సినిమాలో మిడిల్ ఏజ్ చెఫ్ పాత్రలో అనుష్క నటిస్తుందని.. ఓ యంగ్ కుర్రాడితో ఆమె ప్రేమలో పడుతుందనే నేపథ్యంలో ఈ సినిమా కథను తెరకెక్కిస్తున్నారట. ఇక ఈ సినిమాలో అనుష్క ఎలా కనిపించనుందా అని ఆమె అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ సినిమాను మహేష్ బాబు అనే దర్శకుడు డైరెక్ట్ చేస్తుండగా, ఈ సినిమాకు సంబంధించిన ఇతర నటీనటులు, టెక్నీషియన్స్‌కు సంబంధించిన వివరాలను చిత్ర త్వరలోనే వెల్లడించనుంది.