Anushka Shetty: జాతిరత్నం కోసం చెఫ్‌గా మారిన స్వీటీ..!

టాలీవుడ్ స్వీటీ అనుష్క శెట్టి ఇటీవల సినిమాల సంఖ్య చాలా తగ్గించేసింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ప్రాధాన్యతనిస్తూ, ఇతర హీరోల సరసన హీరోయిన్‌గా నటించే సినిమాలను చాలావరకు అనుష్క పక్కనబెట్టేసింది. దీంతో ఈ బ్యూటీ కెరీర్ చాలా స్లోగా సాగుతోంది. జాతిరత్నాలు ఫేం హీరో నవీన్ పోలిశెట్టి నటిస్తున్న ఓ సినిమాలో అనష్క హీరోయిన్‌గా నటిస్తోండగా, ఈ సినిమా నుంచి ఆమె పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర యూనిట్ తాజాగా రిలీజ్ చేసింది.

Anushka Shetty: జాతిరత్నం కోసం చెఫ్‌గా మారిన స్వీటీ..!

Anushka Shetty First Look Form Naveen Polishetty Movie Released

Anushka Shetty: టాలీవుడ్ స్వీటీ అనుష్క శెట్టి ఇటీవల సినిమాల సంఖ్య చాలా తగ్గించేసింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ప్రాధాన్యతనిస్తూ, ఇతర హీరోల సరసన హీరోయిన్‌గా నటించే సినిమాలను చాలావరకు అనుష్క పక్కనబెట్టేసింది. దీంతో ఈ బ్యూటీ కెరీర్ చాలా స్లోగా సాగుతోంది. అయితే, సైజ్ జీరో సినిమా కోసం లావుగా మారిన అనుష్క, ఆ తరువాత మళ్లీ స్లిమ్‌గా మారడానికి చాలా సమయం పట్టింది. అయితే ఇప్పుడు యంగ్ హీరోల సరసన సినిమాల్లో నటించేందుకు అనుష్క రెడీ కావడంతో, జాతిరత్నాలు ఫేం హీరో నవీన్ పోలిశెట్టి నటిస్తున్న ఓ సినిమాలో అనష్క హీరోయిన్‌గా నటిస్తోంది.

Anushka Shetty : 17 ఇయర్స్ ఇండస్ట్రీ.. ఎట్టకేలకు నెక్స్ట్ సినిమా షూట్ మొదలు పెట్టిన అనుష్క..

ఈ సినిమాను అనౌన్స్ చేసిన దగ్గర్నుండీ, ఇందులో అనుష్క పాత్ర ఎలా ఉండబోతుందా, ఈ సినిమాలో ఆమె ఎలా కనిపిస్తుందా అనే ఆసక్తి స్వీటీ అభిమానుల్లో నెలకొంది. అయితే తాజాగా, అనుష్క బర్త్‌డే సందర్భంగా, ఈ సినిమాలో నుంచి ఆమె పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ సినిమాలో అనుష్క చెఫ్ పాత్రలో నటిస్తున్నట్లుగా ఈ పోస్టర్ చూస్తే అర్థమవుతోంది. ఇక ఈ సినిమాలో ఆమె పేరు ‘అన్విత రవళి శెట్టి’గా ఉండబోతున్నట్లుగా చిత్ర యూనిట్ వెల్లడించింది.

Anushka Shetty : అనుష్క సోదరుడి హత్యకు కుట్ర.. హోంమంత్రిని ఆశ్రయించిన అనుష్క సోదరుడు..

ఎట్టకేలకు అనుష్క సినిమాకు సంబంధించి చాలా రోజుల తరువాత ఓ అప్డేట్ రావడంతో ఈ పోస్టర్‌ను ఆమె అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు. ఈ సినిమాను పి.మహేష్ డైరెక్ట్ చేస్తుండగా, యువీ క్రియేషన్స్ బ్యానర్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తోంది. ఈ సినిమాలో పలువురు నోటెడ్ ఆర్టిస్టులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తుండగా, ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్‌ను త్వరలోనే వెల్లడించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.