Apple iPhone 14 Plus : 2023 కొత్త ఏడాదిలో అద్భుతమైన ఆఫర్.. ఐఫోన్ 14 ప్లస్‌పై భారీ డిస్కౌంట్.. ఈ డీల్ మిస్ చేసుకోవద్దు.. ఇప్పుడే కొనేసుకోండి!

Apple iPhone 14 Plus : 2023 కొత్త ఏడాది సందర్భంగా.. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ మేకర్లు తమ ప్రొడక్టులపై రిటైల్ షాపులు, ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ల్లో గాడ్జెట్‌లు, ఎలక్ట్రానిక్స్‌పై అద్భుతమైన ఆఫర్‌లను అందిస్తున్నారు.

Apple iPhone 14 Plus : 2023 కొత్త ఏడాదిలో అద్భుతమైన ఆఫర్.. ఐఫోన్ 14 ప్లస్‌పై భారీ డిస్కౌంట్.. ఈ డీల్ మిస్ చేసుకోవద్దు.. ఇప్పుడే కొనేసుకోండి!

Apple iPhone 14 Plus gets heavy discount up to Rs. 9,000_ Here’s how deal works

Apple iPhone 14 Plus : 2023 కొత్త ఏడాది సందర్భంగా.. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ మేకర్లు తమ ప్రొడక్టులపై రిటైల్ షాపులు, ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ల్లో గాడ్జెట్‌లు, ఎలక్ట్రానిక్స్‌పై అద్భుతమైన ఆఫర్‌లను అందిస్తున్నారు. అందులో ఆపిల్ (iPhone 14 Plus)పై అదిరే ఆఫర్ ప్రకటించారు. ఈ స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్లో (Imagine) స్టోర్‌లలో రూ. 9,000 వరకు డిస్కౌంట్‌‌తో అందుబాటులో ఉంది. మీరు కూడా ఈ కొత్త సంవత్సరంలో ఆపిల్ ఐఫోన్ తక్కువ ధరకే కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇదే సరైన సమయం.. వెంటనే ఆపిల్ ఐఫోన్ 14+ ఫోన్ కొనేసుకోండి.

ఆపిల్ (iPhone 14 Plus) ఐఫోన్ ప్లస్ 128GB, 256GB మోడల్‌లకు వరుసగా రూ. 89,900, రూ. 99,900 ధరతో అందుబాటులో ఉన్నాయి. ఆసక్తిగల కొనుగోలుదారులు రూ. 3,000 స్టోర్ డిస్కౌంట్ పొందవచ్చు. HDFC బ్యాంక్ కార్డ్‌లపై రూ. 5,000 ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ తర్వాత రూ. 81,900 వద్ద 128GB మోడల్‌ను కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ 256GB వేరియంట్ రూ. 4,000 ఇన్‌స్టంట్ స్టోర్ డిస్కౌంట్ రూ. 5,000 ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ తర్వాత రూ. 90,900 వద్ద సొంతం చేసుకోవచ్చు.

ముఖ్యంగా, ప్రస్తుతం రిటైలర్ ఆఫ్‌లైన్ స్టోర్‌లలో ఆఫర్‌లు అందుబాటులో ఉన్నాయి. ఐఫోన్ 14 ప్లస్ 5 రంగులలో సొగసైన ఏరోస్పేస్ గ్రేడ్ అల్యూమినియం డిజైన్‌తో కొత్త 6.7-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. A15 బయోనిక్ చిప్, iOS 16తో అందిస్తుంది. అంతేకాకుండా, ఈ డివైజ్ థర్మల్ పర్ఫార్మెన్స్ కోసం అప్‌డేట్, ఇంటర్నల్ డిజైన్, సూపర్ రెటినా XDR OLED స్క్రీన్‌లు, 1200 nits గరిష్ట HDR బ్రైట్‌నెస్, డాల్బీ విజన్‌తో వస్తుంది.

Apple iPhone 14 Plus gets heavy discount up to Rs. 9,000_ Here’s how deal works

Apple iPhone 14 Plus gets heavy discount up to Rs. 9,000

Read Also : iPhone 14 Lowest Price : ఆపిల్ ఆఫర్ అదిరింది.. అత్యంత తక్కువ ధరకే ఐఫోన్ 14 సిరీస్.. ఏ మోడల్ ధర ఎంతంటే? ఇదిగో లిస్టు మీకోసం..!

ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్ రెండూ సిరామిక్ షీల్డ్ ఫ్రంట్ కవర్ ద్వారా సాధారణ స్పిల్స్, వాటర్ రెసెస్టిన్స్ డస్ట్ రెసెస్టిన్స్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఆప్టిక్స్ కోసం, ఈ హ్యాండ్‌సెట్‌లో 12MP ప్రైమరీ లెన్స్ ఉంది. ఇందులో పెద్ద సెన్సార్, పెద్ద పిక్సెల్‌లు ఉన్నాయి. తక్కువ-కాంతి పర్ఫార్మెన్స్ కోసం f/1.9 అపర్చర్‌తో కూడిన కొత్త 12MP ఫ్రంట్ TrueDepth కెమెరాను అందిస్తుంది.

ఆపిల్ మృదువైన వీడియో కోసం కొత్త యాక్షన్ మోడ్‌ను అందిస్తుంది. మధ్యలో వీడియో క్యాప్చర్ చేయడంతో పాటు షేక్స్, మోషన్, వైబ్రేషన్‌లను అడ్జెస్ట్ చేస్తుంది. అదనంగా, స్మార్ట్‌ఫోన్ సినిమాటిక్ మోడ్‌ను కలిగి ఉంది. అలాగే, వినియోగదారులను 30 fps, 24 fps వద్ద 4K క్యాప్చర్ చేసేందుకు అనుమతిస్తుంది.

ఆసక్తికరంగా, మొత్తం iPhone 14 లైనప్‌లో క్రాష్ డిటెక్షన్, శాటిలైట్ ద్వారా ఎమర్జెన్సీ SOS ఉన్నాయి. iphoneలో ఈ క్రాష్ డిటెక్షన్ తీవ్రమైన కార్ క్రాష్‌ని గుర్తించి, ఎమర్జెన్సీ సర్వీసులకు డయల్ చేయగలదు. శాటిలైట్ ద్వారా ఎమర్జెన్సీ SOS అనేది సెల్యులార్ కవరేజ్ లేనప్పుడు ఎమర్జెన్సీ సర్వీసులతో మెసేజ్ పంపేందుకు ఆప్షన్ ఎనేబుల్ చేస్తుంది. తద్వారా సాఫ్ట్‌వేర్‌తో ఇంటిగ్రేట్ కనెక్టివిటీ ద్వారా వెంటనే శాటిలైట్‌తో కనెక్ట్ అవుతుంది. అంతేకాదు.. Apple నుంచి వచ్చిన ఈ హ్యాండ్‌సెట్‌లలో 5G సపోర్ట్, Wi-Fi 6, బ్లూటూత్ 5.3, రీడర్ మోడ్‌తో NFC వంటి మరెన్నో ఫీచర్లు ఉన్నాయి.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : iPhone 14 Car Crash Detection : ఆపిల్ ఐఫోన్ 14లో కార్ క్రాష్ డిటెక్షన్ ఫీచర్.. ప్రమాదం జరిగిన వెంటనే దగ్గరలోని ఆస్పత్రులను ఎలా అలర్ట్ చేస్తుందో తెలుసా?