iPhone 14 Car Crash Detection : ఆపిల్ ఐఫోన్ 14లో కార్ క్రాష్ డిటెక్షన్ ఫీచర్.. ప్రమాదం జరిగిన వెంటనే దగ్గరలోని ఆస్పత్రులను ఎలా అలర్ట్ చేస్తుందో తెలుసా?

iPhone 14 Car Crash Detection : మీరు ఆపిల్ ఐఫోన్ 14 (iPhone 14) ఉపయోగిస్తున్నారా? అయితే మీ ఐఫోన్‌లో కార్ క్రాష్ డిటెక్షన్ ఫీచర్ (iPhone 14 Car Crash Detection) గురించి తప్పక తెలుసుకోవాల్సిందే. ప్రమాద సమయంలో ప్రాణాలను కాపాడగల అద్భుతమైన ఫీచర్ ఇది..

iPhone 14 Car Crash Detection : ఆపిల్ ఐఫోన్ 14లో కార్ క్రాష్ డిటెక్షన్ ఫీచర్.. ప్రమాదం జరిగిన వెంటనే దగ్గరలోని ఆస్పత్రులను ఎలా అలర్ట్ చేస్తుందో తెలుసా?

iPhone 14 Car Crash Detection _ Your iPhone 14’s car crash detection feature can help you connect with hospitals

iPhone 14 Car Crash Detection : మీరు ఆపిల్ ఐఫోన్ 14 (iPhone 14) ఉపయోగిస్తున్నారా? అయితే మీ ఐఫోన్‌లో కార్ క్రాష్ డిటెక్షన్ ఫీచర్ (iPhone 14 Car Crash Detection) గురించి తప్పక తెలుసుకోవాల్సిందే. ప్రమాద సమయంలో ప్రాణాలను కాపాడగల అద్భుతమైన ఫీచర్ ఇది.. భారత క్రికెటర్ రిషబ్ పంత్ కారు ప్రమాదానికి గురైన సమయంలో ఈ ఆపిల్ ఐఫోన్ కార్ క్రాష్ డిటెక్షన్ ఫీచర్ మళ్లీ వార్తల్లో నిలిచింది. ఢిల్లీ-డెహ్రాడూన్ హైవేపై పంత్ ప్రయాణిస్తున్న మెర్సిడెస్ కారు రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టింది.

దాంతో అతని కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పంత్ తీవ్ర గాయాలు అయ్యాయి. అదృష్టవశాత్తూ పంత్ దగ్ధమైన కారు నుంచి తప్పించుకోగలిగాడు. అలాంటి పరిస్థితుల్లో మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి మీరు చేయగలిగేది చాలా తక్కువగానే ఉంటుంది. అయితే, మీరు iPhone 14 మోడల్‌లలో దేనినైనా ఉపయోగిస్తుంటే.. మీరు కార్ క్రాష్ డిటెక్షన్ ఫీచర్‌ను కూడా పొందుతారు. మీరు కార్ క్రాష్‌ను ఎదుర్కొన్న తర్వాత అత్యవసర సేవలతో కనెక్ట్ అయ్యేందుకు సాయపడుతుంది.

iPhone 14 Car Crash Detection _ Your iPhone 14’s car crash detection feature can help you connect with hospitals

iPhone 14 Car Crash Detection _ Your iPhone 14’s car crash detection feature

Apple కార్ క్రాష్ డిటెక్షన్ ఫీచర్ ఏంటి? :
క్రాష్ డిటెక్షన్ ఫీచర్ అనేది సెడాన్లు, మినీవ్యాన్‌లు, SUVలు, పికప్ ట్రక్కులు, ఇతర ప్యాసింజర్ కార్లతో కూడిన ఫ్రంట్-ఇంపాక్ట్, సైడ్-ఇంపాక్ట్, బ్యాక్-ఎండ్ వంటి తీవ్రమైన కార్ క్రాష్‌లను గుర్తించడానికి ఈ ఫీచర్ రూపొందించారు. Apple కార్ క్రాష్ డిటెక్షన్ ఫీచర్ ఇప్పుడు iPhone 14 మోడల్స్‌తో పాటు Apple Watch Series 8, Apple Watch SE (2వ జనరేషన్), Apple Watch Ultraలో లేటెస్ట్ వెర్షన్ watchOSతో అందుబాటులో ఉంది.

Read Also : iPhone 14 Crash Detection : ఐఫోన్ 14లో క్రాష్ డిటెక్షన్ ఫీచర్ అలర్ట్.. ప్రమాదంలో చిక్కుకున్న మహిళను కాపాడిన ఐఫోన్..!

కారు క్రాష్ డిటెక్షన్ ఫీచర్ ఎలా పని చేస్తుందంటే? :
మీ iPhone 14 మోడల్‌లలో క్రాష్ డిటెక్షన్ డిఫాల్ట్‌గా ఆన్ అయి ఉంటుంది. ఈ ఫీచర్ తీవ్రమైన కారు క్రాష్‌ను గుర్తిస్తే.. వెంటనే అలారం మోగుతుంది. ఐఫోన్ లేదా ఆపిల్ వాచ్‌లో మీరు ప్రయాణించే కారు క్రాష్‌ కాబోతుందని వార్నింగ్ డిస్‌ప్లే చూపిస్తుంది. మీరు అపస్మారక స్థితిలో ఉన్నట్లయితే.. స్క్రీన్ ఎమర్జెన్సీ కాల్ స్లయిడర్‌ను డిస్‌ప్లే చేస్తుంది. మీ ఫోన్ ఆటోమాటిక్‌గా ఎమర్జెన్సీ సర్వీసులకు కాల్ చేస్తుంది. మీరు చేయగలిగితే.. మీరు అత్యవసర సేవలకు కాల్ చేయడాన్ని ఎంచుకోవచ్చు లేదా వార్నింగ్ డిలీట్ చేయవచ్చు.అయితే, ఆ సమయంలో మీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేకపోతే మాత్రం మీ డివైజ్ 20 సెకన్ల తర్వాత అత్యవసర సేవలకు ఆటోమాటిక్‌గా కాల్ చేస్తుంది.

iPhone 14 Car Crash Detection _ Your iPhone 14’s car crash detection feature can help you connect with hospitals

iPhone 14 Car Crash Detection _ Your iPhone 14’s car crash detection feature

దానితో పాటు, మీరు ఎమర్జెన్సీ కాంటాక్ట్‌లను యాడ్ చేసినట్టుయితే.. మీ డివైజ్ మీ లొకేషన్‌ను షేర్ చేసేందుకు మెసేజ్‌ను పంపుతుంది. మీరు తీవ్రమైన కారు ప్రమాదంలో ఉన్నారని వారికి తెలియజేస్తుంది. ముఖ్యంగా, మీ వద్ద Apple Watch, iPhone 14 ఉంటే.. ఎమర్జెన్సీ కాల్ స్లయిడర్ మీ వాచ్‌లో మాత్రమే కనిపిస్తుంది. వెంటనే కాల్ కనెక్ట్ అవుతుంది.

మీ వాచ్ నుంచి కాల్ ఆడియో ప్లే అవుతుంది. కొన్నిసార్లు రోలర్-కోస్టర్ రైడ్‌ల సమయంలో క్రాష్ డిటెక్షన్ ఫీచర్ తప్పుగా చూపించవచ్చు. మీరు తీవ్రమైన కార్ క్రాష్ తర్వాత వార్నింగ్స్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ కాల్‌లను ఆఫ్ చేయవచ్చు. మీరు మీ యాడ్ చేసిన డివైజ్‌లలో ఒకదానిలో ఈ వార్నింగ్స్, కాల్‌లను ఆఫ్ చేసినప్పుడు మీరు వాటిని మీ ఇతర యాడ్ చేసిన డివైజ్‌లలో ఆటోమాటిక్‌గా ఆఫ్ చేయవచ్చు.

iPhoneలో క్రాష్ డిటెక్షన్‌ను ఎలా ఆఫ్ చేయాలంటే? :
* ఆపిల్ ఐఫోన్ సెట్టింగ్‌ల యాప్‌ను ఓపెన్ చేయండి.
* ఎమర్జెన్సీ SOSని Tap చేయండి.
* తీవ్రమైన క్రాష్ తర్వాత కాల్ OFF చేయండి.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : iPhone 14 Lowest Price : ఆపిల్ ఆఫర్ అదిరింది.. అత్యంత తక్కువ ధరకే ఐఫోన్ 14 సిరీస్.. ఏ మోడల్ ధర ఎంతంటే? ఇదిగో లిస్టు మీకోసం..!