iPhone 14 Crash Detection : ఐఫోన్ 14లో క్రాష్ డిటెక్షన్ ఫీచర్ అలర్ట్.. ప్రమాదంలో చిక్కుకున్న మహిళను కాపాడిన ఐఫోన్..!

iPhone 14 Crash Detection : ప్రపంచ కుపెర్టినో ఆధారిత టెక్ దిగ్గజం ఆపిల్ (Apple) అందించే ప్రొడక్టుల్లో ఒకటైన ఐఫోన్ 14 (iPhone 14)లో క్రాష్ డిటెక్షన్ (Carsh Detection) ఫీచర్ అందుబాటులో ఉంది. ఇప్పటికే ఈ కొత్త ఫీచర్ అనేక మంది ప్రాణాలను కాపాడింది.

iPhone 14 Crash Detection : ఐఫోన్ 14లో క్రాష్ డిటెక్షన్ ఫీచర్ అలర్ట్.. ప్రమాదంలో చిక్కుకున్న మహిళను కాపాడిన ఐఫోన్..!

iPhone 14 crash detection feature alerts man of his wife’s accident and helps save her life

Updated On : December 14, 2022 / 6:03 PM IST

iPhone 14 Crash Detection : ప్రపంచ కుపెర్టినో ఆధారిత టెక్ దిగ్గజం ఆపిల్ (Apple) అందించే ప్రొడక్టుల్లో ఒకటైన ఐఫోన్ 14 (iPhone 14)లో క్రాష్ డిటెక్షన్ (Carsh Detection) ఫీచర్ అందుబాటులో ఉంది. ఇప్పటికే ఈ కొత్త ఫీచర్
అనేక మంది ప్రాణాలను కాపాడింది. లేటెస్టుగా ఆపిల్ ఈ ఏడాదిలో iPhone 14, iPhone 14 Pro, Apple Watch Series 8, Apple Watch Ultra వంటి కొన్ని ప్రొడక్టుల్లోనూ క్రాష్ డిటెక్షన్ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్రొడక్టులన్నీ కార్ క్రాష్ డిటెక్షన్ కోసం అడ్వాన్స్‌డ్ సెన్సార్‌లతో వచ్చింది. ఈ ఐఫోన్ కొత్త ఫీచర్ ఇటీవల మహిళకు జరిగిన ప్రమాదానికి సంబంధించి ఆమె భర్తకు అలర్ట్ పంపడం ద్వారా ఆమెను రక్షించడంలో సాయపడింది.

Reddit పోస్ట్ ప్రకారం.. ఐఫోన్ 14 క్రాష్ డిటెక్షన్ ఫీచర్.. ఒక వ్యక్తి భార్య ప్రమాదానికి గురైన వెంటనే అతన్ని అప్రమత్తం చేసింది. ఈ ఫీచర్ కచ్చితమైన ప్రమాద ప్రాంతాన్ని గుర్తించేందుకు లొకేషన్ షేర్ చేసింది. ఈ క్రాష్ డిటెక్షన్ ఫీచర్ సాయంతో అతను అంబులెన్స్ రాకముందే సంఘటన స్థలానికి చేరుకున్నాడని రెడ్డిట్ పోస్ట్ వివరించింది.

iPhone 14 crash detection feature alerts man of his wife’s accident and helps save her life

iPhone 14 crash detection feature alerts man of his wife’s accident and helps save her life

Read Also : Buy iPhone 14 Pro : ఆపిల్ ఐఫోన్ 14 ప్రో కొనడం ఇప్పట్లో కష్టమే.. ఎందుకో తెలుసా? అసలు కారణం ఇదే..!

అలాగే, తన భార్య షాప్ నుంచి ఇంటికి వెళ్తూ తనతో ఫోన్‌లో మాట్లాడుతుందని చెప్పాడు. అదే సమయంలో తనకు ఆమె అరుపు వినిపించిందని తెలిపాడు. కొన్ని సెకన్లలో ప్రమాదం జరిగిందని ఆమె ఐఫోన్ నుంచి నాకు నోటిఫికేషన్ వచ్చిందన్నాడు. అప్పుడు వెంటనే ఆమె ఉన్న లొకేషన్ ద్వారా సంఘటన స్థలానికి చేరుకున్నానని తెలిపాడు. అంబులెన్స్ రాకముందే తాను అక్కడికి చేరుకున్నానని చెప్పాడు.

క్రాష్ డిటెక్షన్ ఫీచర్ ఎలా పని చేస్తుందంటే? :
క్రాష్ డిటెక్షన్ ఫీచర్ చాలా సులభంగా వినియోగించవచ్చు. ఈ ఫీచర్ ఎమర్జెన్సీ SOSని యాక్టివేట్ చేస్తుంది. ఆ తర్వాత యూజర్ ఎమర్జెన్సీ కాంటాక్ట్ లిస్ట్‌లోని ఎవరినైనా ముందుగా అలర్ట్ చేస్తుంది. అల్గోరిథం ప్రకారం.. iPhone నుంచి సమాచారాన్ని ఉపయోగిస్తుంది. క్రాష్ జరిగింది లేదో ఈ ఫీచర్ నిర్ధారిస్తుంది. వెంటనే ఎమర్జెన్సీ కోసం కాల్ చేస్తుంది. ఆపిల్ అందించే iPhone 14, iPhone 14 Pro మోడల్స్ వినియోగదారులు అత్యవసర కాంటాక్టులకు యాడ్ చేసేందుకు ఆరోగ్య యాప్‌ను విజిట్ చేయవచ్చు. ఇంకెందుకు ఆలస్యం.. మీ ఐఫోన్ మోడల్‌లోనూ క్రాష్ డిటెక్షన్ ఫీచర్ ఉందో లేదో ఇప్పుడే చెక్ చేసుకోండి.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : iPhone 14 Cheap Price : అత్యంత చౌకైన ధరకే ఆపిల్ ఐఫోన్ 14 సొంతం చేసుకోండి.. ఫ్లిప్‌కార్ట్‌లో ధరలను ఎలా ట్రాక్ చేయాలో తెలుసా?