Arjun Rampal : సహజీవనంతో పిల్లలు.. పెళ్లి మాత్రం వద్దు అంటున్న బాలీవుడ్ నటుడు

తాజాగా ఓ ఇంటర్వ్యూలో మీకు బాబు కూడా పుట్టాడు, ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటారు అని అడగడంతో అర్జున్ రాంపాల్ మాట్లాడుతూ.. ''మా ఈ బంధాన్ని నిరూపించుకోవడానికి కాగితం ముక్కలు అవసరం లేదు...

Arjun Rampal : సహజీవనంతో పిల్లలు.. పెళ్లి మాత్రం వద్దు అంటున్న బాలీవుడ్ నటుడు

Arjun

Arjun Rampal :   ఇటీవల చాలా మంది స్టార్లు పెళ్లిళ్లు చేసుకొని విడిపోతున్నారు. సెలబ్రిటీల బంధాలు ఎక్కువ కాలం నిలవట్లేదు. అందుకే కొంతమంది సెలబ్రిటీలు తెలివిగా సహజీవనం చేస్తున్నారు. సహజీవనం అయితే కలిసి ఉన్నన్ని రోజులు ఉండొచ్చు, విడిపోవాలి అనుకుంటే విడిపోవచ్చు. టాలీవుడ్ కి ఈ సంస్కృతి ఇంకా పాకకపోయినా బాలీవుడ్ లో మాత్రం ఇప్పటికే చాలా మంది స్టార్లు సహజీవనం చేస్తున్నారు.

అయితే తాజగా ఓ బాలీవుడ్ నటుడు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ తన ప్రియురాలు నటి గాబ్రియెల్లా డెమోట్రియాడ్స్ తో కొన్ని సంవత్సరాలుగా సహజీవనం చేస్తున్నాడు. వీరిద్దరికి కలిపి ఒక బాబు కూడా పుట్టాడు. పెళ్లి చేసుకోకుండానే బాబుని కని, ఇంకా పెళ్లి చేసుకోకుండా అలాగే సహజీవనం పేరుతో కలిసి ఉంటున్నారు వీరిద్దరూ.

K Viswanath : మీ దర్శకత్వంలో నటించడం నా అదృష్టం.. కళాతపస్వికి మెగాస్టార్ జన్మదిన శుభాకాంక్షలు

తాజాగా ఓ ఇంటర్వ్యూలో మీకు బాబు కూడా పుట్టాడు, ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటారు అని అడగడంతో అర్జున్ రాంపాల్ మాట్లాడుతూ.. ”మా ఈ బంధాన్ని నిరూపించుకోవడానికి కాగితం ముక్కలు అవసరం లేదు. మనసులు కలిసిన రోజే మా వివాహం అయిపోయింది. భార్యభర్తల కన్నా మేమేమీ తక్కువ కాదు. ఇలా ఈ బంధాన్ని వివాహంతో ముడివేయడం నా కంటే కూడా గాబ్రియెల్లాకే ఇష్టం లేదు.” అని వ్యాఖ్యానించారు.

Rana Daggubati : భళ్లాలదేవ క్రేజ్‌ని ‘బీమ్లా నాయక్’ ఎందుకు వాడట్లేదు??

దీంతో ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇన్నాళ్లు డేటింగ్ పేరుతో కలిసి ఉండి తర్వాత విడిపోవడం చూశాం కానీ, పిల్లలు పుట్టాక కూడా పెళ్లి వద్దు డేటింగ్ ముద్దు అనే వాళ్ళని మిమ్మల్నే చూస్తున్నామని వీరి జంటకి కామెంట్లు ఇస్తున్నారు నెటిజన్లు.