Rana Daggubati : భళ్లాలదేవ క్రేజ్‌ని ‘బీమ్లా నాయక్’ ఎందుకు వాడట్లేదు??

పవన్ కళ్యాణ్ కి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. ఆయన సినిమాకి ప్రమోషన్స్ కూడా అవసర్లేదు. పవన్ కళ్యాణ్ సినిమాకి ఓపెనింగ్స్ భారీగానే వస్తాయి. అయితే.......

Rana Daggubati : భళ్లాలదేవ క్రేజ్‌ని ‘బీమ్లా నాయక్’ ఎందుకు వాడట్లేదు??

Rana

Rana Daggubati :  పవన్ కళ్యాణ్, రానాలు కలిసి మల్టీస్టారర్ గా తెరకెక్కిన ‘భీమ్లా నాయక్’ సినిమా ఫిబ్రవరి 25న రిలీజ్ అవ్వనుంది. అయితే మొదట మల్టీస్టారర్ అనుకున్నా సినిమా కాస్తా వన్ సైడ్ సినిమాగా మారిపోయింది. సినిమాలో ఎలా ఉంటాడో తెలీదు కానీ ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్స్, ప్రమోషన్స్ లో ఎక్కడా రానా అంతగా కనపడలేదు. అసలు రానా ఆ సినిమాలో ఉన్నాడని కూడా మర్చిపోయారు కొంతమంది.

పవన్ కళ్యాణ్ కి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. ఆయన సినిమాకి ప్రమోషన్స్ కూడా అవసర్లేదు. పవన్ కళ్యాణ్ సినిమాకి ఓపెనింగ్స్ భారీగానే వస్తాయి. అయితే ‘భీమ్లా నాయక్’ సినిమా విషయంలో మొదటి నుంచి కూడా రానాని పక్కన పెట్టడంతో రానా అభిమానులు దీనిపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక భీమ్లా నాయక్ సినిమాని హిందీలో కూడా రిలీజ్ చేయాలని భావించారు నిర్మాతలు.

NBK 107 : సిరిసిల్లలో బాలయ్య బాబు సినిమా షూటింగ్

ఇక్కడ పవన్ కళ్యాణ్ కి పరిచయం అవసరం లేదు కానీ హిందీలో పవన్ కళ్యాణ్ అంతగా తెలీదు. రానా ‘బాహుబలి’ సినిమాతో దేశమంతటా స్టార్ డం తెచ్చుకున్నాడు. అంతే కాక రానా పలు హిందీ సినిమాల్లో నటించాడు. హిందీలో స్ట్రైట్ సినిమా కూడా చేసాడు. బాలీవుడ్ యాక్టర్స్ తో రానాకి మంచి సంబంధాలు ఉన్నాయి. హిందీలో ‘భీమ్లా నాయక్’ సినిమా ప్రమోషన్ అవ్వాలంటే కచ్చితంగా రానాని వాడుకోవాల్సిందే.

Prakash Padukone : తండ్రి బయోపిక్‌ని తెరకెక్కించనున్న దీపిక పదుకొణె

సినిమా రిలీజ్ కి ఒక వారమే ఉండగా ఇంకా పూర్తి స్థాయిలో ప్రమోషన్స్ చెయ్యట్లేదు మేకర్స్. మరి ఈ సినిమాని పాన్ ఇండియా చేయాలి అనుకుంటే, హిందీలో కూడా కలెక్షన్స్ రావాలి అంటే, పవన్ నెక్స్ట్ సినిమాకి కూడా ప్లస్ అవ్వాలి అంటే రానాని ప్రమోషన్స్ కి వాడాల్సిందే. లేకపోతే సినిమాకి కాస్తో కూస్తో ఎఫెక్ట్ అవ్వొచ్చు. ఇప్పటికే రానా ఫ్యాన్స్ రానాని పక్కన పెట్టేశారని అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇది సినిమాకి నెగిటివ్ అవ్వకముందే రానాని ప్రమోషన్స్ కి దింపితే బెటర్. పవన్ ఎలాగో ప్రమోషన్స్ లో పాల్గొనరు. ఒక వేళ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటే వస్తారు. అలాంటప్పుడు రానాతోనే సినిమాని ప్రమోట్ చేయాలి. మరి ఏం జరుగుతుందో చూడాలి.