Prakash Padukone : తండ్రి బయోపిక్‌ని తెరకెక్కించనున్న దీపిక పదుకొణె

తాజాగా దీపిక పదుకొణె నుంచి 'గెహ్రాయాన్' సినిమా అమెజాన్ లో రిలీజ్ అయింది. ఈ సినిమా ప్రెస్ మీట్ లో తన తండ్రి బయోపిక్ ని నిర్మిస్తానని తెలిపింది. ఇటీవల జరిగిన ప్రెస్ మీట్ లో దీపికా...

Prakash Padukone : తండ్రి బయోపిక్‌ని తెరకెక్కించనున్న దీపిక పదుకొణె

Deepika

 

Prakash Padukone :  ఇటీవల అన్ని సినీ పరిశ్రమలలో బయోపిక్స్ లు వరుసగా వస్తున్నాయి. బాలీవుడ్ లో అయితే బయోపిక్ ల పర్వం నడుస్తుంది. ఇప్పటికే అనేక సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖుల బయోపిక్ లు తెరకెక్కాయి. ఇంకా అనేక బయోపిక్ లు నిర్మాణంలో ఉన్నాయి. తాజాగా మరో బయోపిక్ రానుంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా తండ్రి ప్రకాష్ పదుకొణె ఒకప్పుడు బ్యాడ్మింటన్ ఛాంపియన్. వరల్డ్ ఛాంపియన్ షిప్ కూడా గెలిచారు.

తాజాగా దీపిక పదుకొణె నుంచి ‘గెహ్రాయాన్’ సినిమా అమెజాన్ లో రిలీజ్ అయింది. ఈ సినిమా ప్రెస్ మీట్ లో తన తండ్రి బయోపిక్ ని నిర్మిస్తానని తెలిపింది. ఇటీవల జరిగిన ప్రెస్ మీట్ లో దీపికా మాట్లాడుతూ.. ”1983 భారత క్రికెట్‌ జట్టు తొలిసారి వరల్డ్‌కప్‌ గెలుచుకొని ప్రపంచానికి మనమంటే ఏంటో చూపించింది. కానీ దాని కంటే ముందే ప్రపంచంలో భారత క్రీడల గురించి మాట్లాడుకునేలా చేసిన ఇండియన్‌ క్రీడాకారుల్లో నాన్న ప్రకాశ్‌ పదుకొణె ఒకరు. 1981లో ఆయన బ్యాడ్మింటన్‌ వరల్డ్‌ ఛాంపియన్‌ షిప్‌ గెలుచుకున్నారు. 1983 కన్నా ముందే ప్రపంచంలోనే బ్మాడ్మింటన్‌ క్రీడను నాన్న తన ఆటతో ఉన్నత శిఖరాలకు చేర్చారు. అప్పట్లో ఆ విజయం అంత ఈజీగా రాలేదు. ఇప్పుడున్నంత అధునాతన వసతులు, సౌకర్యాలు అప్పటి క్రీడాకారులకు లేవు. అప్పట్లో ఇండియాలో బ్యాడ్మింటన్ కోర్టులు కూడా లేక మ్యారేజీ హాల్లో శిక్షణ తీసుకున్నారు. ఒక్కోమెట్టూ కష్టపడి ఎదిగారు నాన్న. ఇప్పుడున్న సదుపాయాలు అప్పుడు ఉంటే ఆయన మరింత రాణించేవారు.” అని తెలిపింది.

Anasuya : ఏజ్ విషయంలో రాసిన ఆర్టికల్ పై ఫైర్ అయిన అనసూయ..

”అప్పట్లో ఎలాంటి సదుపాయాలు లేకుండానే ఎంతో కష్టపడి వరల్డ్ ప్రపంచ ఛాంపియన్ షిప్ ని సాధించారు. ఆయన కష్టం, విజయం అందరికి తెలియాలి. అందుకే నాన్న గారి బయోపిక్ ని నిర్మిస్తాను. నాన్న గారి గురించి అందరికి తెలిసేలా ఆయన చరిత్రని బయోపిక్ తీస్తాను.” అని తెలిపారు.