Arjuna Phalguna : ‘ఆహా’ లో ‘అర్జున ఫల్గుణ’.. ఎప్పుడంటే..

ప్రామిసింగ్ యాక్టర్ శ్రీ విష్ణు, అమృత అయ్యర్ హీరో హీరోయిన్లుగా నటించిన కామెడీ థ్రిల్లర్ ‘ఆహా’ లో స్ట్రీమింగ్ కానుంది..

Arjuna Phalguna : ‘ఆహా’ లో ‘అర్జున ఫల్గుణ’.. ఎప్పుడంటే..

Arjuna Phalguna

Updated On : January 13, 2022 / 7:21 PM IST

Arjuna Phalguna: తెలుగు ప్రజల అరచేతిలోకి వినోదాన్ని, తెలుగు వారికి అంతులేని అమితానందాన్ని అందిస్తూ డిజిటల్ రంగంలో అగ్రగామిగా దూసుకుపోతోంది తొలి తెలుగు ఓటీటీ ‘ఆహా’.
బ్లాక్‌బస్టర్ మూవీస్, అదిరిపోయే టాక్ షోస్, థ్రిల్లింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్‌తో మరో ఓటీటీ కూడా ఇవ్వలేని ఎండ్ లెస్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తోంది. ప్రేక్షకులకు వినోదాన్నందించే విషయంలో ఎప్పటికప్పుడు తనకు తానే పోటీ పడుతూ తనకు తానే సాటిగా నిరూపించుకుంటున్న ‘ఆహా ఇప్పుడు మరో డిఫరెంట్ కామెడీ థ్రిల్లర్‌ను తమ ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది.

Lakshya Movie : ‘ఆహా’ లో ‘లక్ష్య’ సెన్సేషన్!

ప్రామిసింగ్ యాక్టర్ శ్రీ విష్ణు, అమృత అయ్యర్ హీరో హీరోయిన్లుగా.. జోహార్’ తో ప్రేక్షకుల అభినందనలు, విమర్శకుల ప్రశంసలందుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ తేజ మర్ని దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘అర్జున ఫల్గుణ’.. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ మీద నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించారు.

Unstoppable with NBK : బాలయ్య దెబ్బకి ‘థింకింగ్’ మారిపోతుందని ముందే చెప్పాం-‘ఆహా’ టీం

ఈ మూవీలో శ్రీవిష్ణు యంగ్ టైగర్ ఎన్టీఆర్ వీరాభిమానిగా, హీరోయిన్ గ్రామ వాలంటీర్‌గా కనిపించారు. 2021 డిసెంబర్ 31 న రిలీజ్ అయిన ‘అర్జున ఫల్గుణ’, 2022 జనవరి 26 రిపబ్లిక్ డే స్పెషల్‌గా ‘ఆహా’ లో స్ట్రీమింగ్ కానుంది.

Arjuna Phalguna : ట్రైలర్‌లో జూనియర్ ఎన్టీఆర్‌ని బాగానే వాడారుగా..