Lakshya Movie : ‘ఆహా’ లో ‘లక్ష్య’ సెన్సేషన్!

‘ఆహా’ లో నాలుగు రోజుల్లోనే రికార్డ్ రేంజ్ స్ట్రీమింగ్ మినిట్స్ సాధించింది స్పోర్ట్స్ బేస్డ్ ఎమోషనల్ ఫిలిం ‘లక్ష్య’..

Lakshya Movie : ‘ఆహా’ లో ‘లక్ష్య’ సెన్సేషన్!

Lakshya

Updated On : January 13, 2022 / 3:04 PM IST

Lakshya Movie: తెలుగు ప్రజల అరచేతిలోకి వినోదాన్ని, తెలుగు వారికి అంతులేని అమితానందాన్ని అందిస్తూ డిజిటల్ రంగంలో అగ్రగామిగా దూసుకుపోతోంది తొలి తెలుగు ఓటీటీ ‘ఆహా’. ఆరంభించిన అనతికాలంలోనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూవీలవర్స్ చేత ‘ఆహా’ అనిపించుకుంది.

Aha OTT: తెలుగు మోస్ట్ వాంటెడ్ ఓటీటీ ఆహా.. త్వరలో తమిళంలో!

బ్లాక్‌బస్టర్ మూవీస్, అదిరిపోయే టాక్ షోస్, థ్రిల్లింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్‌తో మరో ఓటీటీ కూడా ఇవ్వలేని ఎండ్ లెస్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తోంది. ప్రేక్షకులకు వినోదాన్నందించే విషయంలో ఎప్పటికప్పుడు తనకు తానే పోటీ పడుతూ తనకు తానే సాటిగా నిరూపించుకుంటున్న ‘ఆహా’ ఖాతాలో ఇప్పుడు మరో రేర్ రికార్డ్ వచ్చి చేరింది.

Unstoppable with NBK : బాలయ్య దెబ్బకి ‘థింకింగ్’ మారిపోతుందని ముందే చెప్పాం-‘ఆహా’ టీం

యంగ్ హీరో నాగ శౌర్య, కేతిక శర్మ, సచిన్ ఖేడ్‌కర్, జగపతి బాబు కీలకపాత్రల్లో నటించిన స్పోర్ట్స్ బేస్డ్ ఎమోషనల్ ఫిలిం ‘లక్ష్య’ ‘ఆహా’ లో ప్రీమియర్ అవుతున్నసంగతి తెలిసిందే. కేవలం నాలుగు రోజుల్లోనే అక్షరాలా 100 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ దక్కించుకుని సెన్సేషన్ క్రియేట్ చేసింది. గోల్ రీచ్ అవాలనుకునే పార్థు అనే కుర్రాడి స్పూర్తివంతమైన జర్నీకి ఆడియన్స్ అంతా కనెక్ట్ అయ్యారు. ‘లక్ష్య’ తో ‘ఆహా’ పేరు మరోసారి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది..

Pushpa Movie : ‘సామీ సామీ’ సాంగ్‌కి నేపాల్ ఫ్యాన్స్ రచ్చ రంబోలా!