SRK Son Aryan Khan : ఆర్యన్ ఖాన్ రేపు విడుదల..రాత్రి జైల్లోనే

డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ విడుదలలో జాప్యం జరుగుతోంది. బెయిల్ కు సంబంధించిన పత్రాలు సకాలంలో జైలు అధికారులకు అందలేదు.

SRK Son Aryan Khan : ఆర్యన్ ఖాన్ రేపు విడుదల..రాత్రి జైల్లోనే

Aryankhan

Aryan Khan Released : డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ విడుదలలో జాప్యం జరుగుతోంది. బెయిల్ కు సంబంధించిన పత్రాలు సకాలంలో జైలు అధికారులకు అందలేదు. దీంతో ఆర్యన్ ఖాన్ ఈ రాత్రికి కూడా జైలులోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. జైల్లో ఉన్న కొడుకు ఆర్యన్ ఖాన్ ను చూడడం కోసం బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ మరోరోజు ఎదురు చూడాల్సి వస్తోంది.

Read More : UP : బొమ్మ అనుకున్నావా ? పిల్లాడిని బల్డింగ్‌‌పై నుంచి వేలాడదీసిన హెడ్ మాస్టర్

2021, అక్టోబర్ 30వ తేదీ శనివారం ఆర్యన్ ఖాన్ జైలు నుంచి విడుదలవుతాడు. క్రూయిజ్‌ షిప్‌ డ్రగ్స్‌కేసులో అరెస్టయిన ఆర్యన్‌ ఖాన్‌కు ఎట్టకేలకు బెయిల్‌ మంజూరు కావడంతో షారుఖ్‌ ఫ్యాన్స్‌ ఖుషి అవుతున్నారు. అటు బాలీవుడ్ వర్గాల్లోనూ ఆనందం వ్యక్తమవుతోంది. బాంబే హైకోర్టు ఆర్యన్‌తో పాటు అర్బాజ్‌, మూన్‌మూన్‌ ధమేచాలకు బెయిల్‌ మంజూరు చేసింది. దీంతో దాదాపు మూడు వారాలుగా జైలులో ఉన్న ఆర్యన్‌ ఖాన్‌ జైలు నుంచి విడుదలయ్యేందుకు లైన్ క్లియర్‌ అయింది.

Read More : Jammu And Kashmir : స్కూల్స్,బిల్డింగ్స్,రోడ్లకు అమర జవాన్ల పేర్లు

బెయిల్‌ పిటిషన్‌పై బాంబే హైకోర్టులో మూడు రోజుల నుంచి సుదీర్ఘ వాదనలు కొనసాగాయి. ఆర్యన్‌ ఖాన్‌ తరఫున ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపించారు.కుట్రపూరితంగానే ఆర్యన్‌ను ఎన్‌సీబీ అధికారులు ఈ కేసులో ఇరికించారన్నారు. ఆర్యన్‌ వద్ద ఎలాంటి డ్రగ్స్‌ లభించలేదని.. డ్రగ్స్‌ తీసుకున్నట్టు కూడా వైద్య పరీక్షల ఆధారాలేవీ లేవని కోర్టుకు పదేపదే తెలిపారు. ఆర్యన్‌తో పాటు కలిసి వచ్చిన ఓ వ్యక్తి వద్ద డ్రగ్స్‌ దొరికితే.. ఆర్యన్‌ను ఎలా అరెస్టు చేస్తారని.. 20 రోజులకు పైగా ఎలా జైలులో ఉంచుతారని ప్రశ్నించారు ముకుల్‌.