Chandan Kumar : సీరియల్ హీరో చెంప చెళ్లుమనిపించిన అసిస్టెంట్ డైరెక్టర్

తాజాగా శ్రీమతో శ్రీనివాస్ సీరియల్ షూటింగ్ లో సీరియల్ కి పనిచేస్తున్న ఓ అసిస్టెంట్ డైరెక్టర్ ని చందన్ బూతులు తిడుతూ హంగామా చేశాడు. దీంతో ఆ అసిస్టెంట్ డైరెక్టర్ కారణం లేకుండానే బూతులు తిట్టాడని........

Chandan Kumar : సీరియల్ హీరో చెంప చెళ్లుమనిపించిన అసిస్టెంట్ డైరెక్టర్

Chandan Kumar :  బుల్లితెర హీరో, నటుడు చందన్ కుమార్ పై ఓ సీరియల్ అసిస్టెంట్ డైరెక్టర్ చేయి చేసుకున్నాడు. సావిత్రమ్మ గారి అబ్బాయి సీరియల్ తో తెలుగులో గుర్తింపు పొందిన కన్నడ నటుడు చందన్‌ కుమార్‌ ప్రస్తుతం తెలుగులో ‘శ్రీమతి శ్రీనివాస్‌’ సీరియల్లో లీడ్‌ రోల్‌ చేస్తున్నాడు. కన్నడలో బాగా ఫేమస్ ఉన్న చందన్ తెలుగులో ఇప్పుడిప్పుడే పేరు తెచ్చుకుంటున్నాడు.

తాజాగా శ్రీమతో శ్రీనివాస్ సీరియల్ షూటింగ్ లో సీరియల్ కి పనిచేస్తున్న ఓ అసిస్టెంట్ డైరెక్టర్ ని చందన్ బూతులు తిడుతూ హంగామా చేశాడు. దీంతో ఆ అసిస్టెంట్ డైరెక్టర్ కారణం లేకుండానే బూతులు తిట్టాడని, నా తల్లిని దూషించాడని అతనితో వాదనకి దిగాడు. ఈ క్రమంలో అక్కడ పని చేస్తున్న వారంతా హీరోపై సీరియస్ అయ్యారు. అతనికి క్షమాపణ చెప్పమనడంతో చందన్ కుమార్ నేనేంటో చూపిస్తా అంటూ సీరియస్ అయ్యాడు. దీంతో ఆగ్రహించిన అసిస్టెంట్ డైరెక్టర్ చందన్ కుమార్ ని అందరి ముందే కొట్టాడు.

Chiranjeevi: 7వ తరగతిలోనే… అంటూ చిలిపి పనులు బయటపెట్టిన మెగాస్టార్

చుట్టూ ఉన్న వాళ్ళు ఆ గొడవని ఆపడానికి ప్రయత్నించారు. హీరోపై సీరియల్ టీం అంతా సీరియస్ అయ్యారు. చందన్ షూటింగ్ నుంచి వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. దీంతో ఈ సంఘటన టాలీవుడ్ బుల్లితెర వర్గాల్లో చర్చగా మారింది.