Theaters : ఒక టికెట్ కొంటే ఇంకో టికెట్ ఫ్రీ.. అయినా థియేటర్ కి రాని జనం..

ఇటీవల వారానికి ఒక పెద్ద సినిమా అయినా రిలీజ్ అవుతుంది టాలీవుడ్ లో. అయినా కలెక్షన్లు రావట్లేదు. థియేటర్లకు జనాలు రావట్లేదు. ఈ నేపథ్యంలో ఏపీలోని నంద్యాల జిల్లా వెలుగోడులోని రంగా థియేటర్ లో.....

Theaters : ఒక టికెట్ కొంటే ఇంకో టికెట్ ఫ్రీ.. అయినా థియేటర్ కి రాని జనం..

Thankyou

Movie Theaters :  ప్రేక్షకులు థియేటర్ కి రావట్లేదని సినీ పరిశ్రమ గగ్గోలు పెడుతుంది. టికెట్ ధరలు పెంచడంతో, హాల్స్ లో స్నాక్స్, కూల్ డ్రింక్స్ కూడా భారీగా అమ్మడంతో, సినిమాలు త్వరగా ఓటీటీలోకి రావడంతో సామాన్య ప్రజలు థియేటర్ కి రావడం మానేశారు. ఈ సమస్యలతో పాటు టాలీవుడ్ సమస్యలతో పెద్దలంతా జనాల్ని థియేటర్స్ కి ఎలా రప్పించాలా అని ఆలోచిస్తున్నారు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. రోజు రోజుకి థియేటర్స్ పరిస్థితి మరీ దారుణంగా తయారవుతుంది. ఆఖరికి ఒక టికెట్ కొంటే మరో టికెట్ ఫ్రీ అని పెట్టినా జనాలు రావట్లేదు.

Vijay Devarakonda : లైగర్ యాటిట్యూడ్.. మరో మాస్ సాంగ్ తో విజయ్..

ఇటీవల వారానికి ఒక పెద్ద సినిమా అయినా రిలీజ్ అవుతుంది టాలీవుడ్ లో. అయినా కలెక్షన్లు రావట్లేదు. థియేటర్లకు జనాలు రావట్లేదు. ఈ నేపథ్యంలో ఏపీలోని నంద్యాల జిల్లా వెలుగోడులోని రంగా థియేటర్ లో నాగ చైతన్య నటించిన థ్యాంక్యూ సినిమా రిలీజ్ అయింది. కొత్త సినిమా అయినా కానీ థియేటర్ కి జనాలు రావట్లేదు. దీంతో థియేటర్ యాజమాన్యం రూ.70తో ఒక టికెట్ కొంటే మరొకటి ఫ్రీ అనే ఆఫర్ పెట్టింది. ఈ ఆఫర్ తో అయినా ప్రేక్షకులు క్యూ కడతారని భావించారు. కానీ హాల్లో కనీసం పావు శాతం కూడా నిండలేదు. దీంతో ఏం చేయాలో తేలిక థియేటర్ యాజమాన్యం వాపోతున్నారు. మరి టాలీవుడ్ పెద్దలు ఈ సమస్యలకి పరిష్కారం చూస్తారా, జనాలు థియేటర్ కి వచ్చేలా చేస్తారా చూడాలి.