Avatar2 Teaser Trailer : వావ్ అనాల్సిందే.. విజువల్ వండర్ అవతార్-2 టీజర్ ట్రైలర్ వచ్చేసింది

2009లో హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ జేమ్స్ కామెరాన్ సృష్టించిన గొప్ప విజువల్ వండర్. ప్రపంచ వెండితెరపై ఈ చిత్రం సృష్టించిన ప్రభంజనం అంతాఇంతా కాదు. తాజాగా అవతార్-2కి చెందిన టీజర్ ట్రైలర్ వచ్చేసింది.

Avatar2 Teaser Trailer : వావ్ అనాల్సిందే.. విజువల్ వండర్ అవతార్-2 టీజర్ ట్రైలర్ వచ్చేసింది

Avatar2 Teaser Trailer

Avatar2 Teaser Trailer : అవతార్.. ప్రపంచ వెండితెరపై ఈ చిత్రం సృష్టించిన ప్రభంజనం అంతాఇంతా కాదు. 2009లో హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ జేమ్స్ కామెరాన్ సృష్టించిన గొప్ప విజువల్ వండర్. అనేక భాషల్లోకి డబ్ అయిన ఈ చిత్రం నిర్మాతలకు కనక వర్షం కురిపించింది. ఆస్కార్ వేదికపైనా అవార్డులు కొల్లగొట్టింది. ఇప్పుడీ చిత్రానికి సీక్వెల్ వస్తోంది. అవతార్-2(ది వే ఆఫ్​ వాటర్) ఈ ఏడాది డిసెంబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది.

OTT Release: గెట్ రెడీ.. ఈ వారం ఓటీటీలో రాబోయే సినిమాలివే!

తాజాగా అవతార్-2కి చెందిన టీజర్ ట్రైలర్ ను చిత్రబృందం సోషల్ మీడియాలో విడుదల చేసింది. ఈసారి అవతార్ లో సముద్ర లోకాన్ని ఆవిష్కరించినట్టు టీజర్ ట్రైలర్ చెబుతోంది. అద్భుతమైన గ్రాఫిక్స్ మాయాజాలం అడుగడుగునా దర్శనమిస్తోంది. ఈ ట్రైలర్‌ పండోరా గ్రహానికి సంబంధించిన విజువల్స్‌తో ప్రారంభం కాగా, అందులోని అద్భుతమైన లొకేషన్లు, మైమరిపించే నీలి సముద్రం అబ్బురపరిచేలా ఉన్నాయి. ట్రైలర్‌ ఆసక్తిగా ఉన్నా సినిమా కథేంటి అనేది సస్పెన్స్‌గానే ఉంచారు. మొత్తమ్మీద టీజర్ ట్రైలర్ తోనే అవతార్-2పై అంచనాలను మరింత పెంచేశారు.

Bollywood: కమర్షియల్ కంటెంట్‌కు దూరమైన బాలీవుడ్.. అందుకే సౌత్ డామినేషన్!

అవతార్-2 చిత్రాన్ని ఎన్నడూ లేని విధంగా ఏకంగా 160 భాషల్లో డిసెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనుంది చిత్ర బృందం. ఇక 2024లో అవతార్‌ 3, 2026లో అవతార్ 4, 2028లో అవతార్‌ 5 సినిమాలు రిలీజ్ చేయనున్నారు.