Nithiin : స్టార్ హీరో నితిన్ చేతుల మీదుగా మణికొండలో ‘బాబాయ్ హోటల్’ ప్రారంభం..

ఎంత సంపాదించినా జానెడు పొట్ట నింపడం కోసమే, కోటి విద్యలు కూటి కొరకే అని అంటుంటారు. కానీ ఈ మధ్య కాలంలో మనం మంచి ఆహారాన్ని ఆస్వాదించడం, రుచికరమైన భోజనాన్ని తినడం చాలా కష్టంగా మారిపోయింది. ఇప్పుడున్న హడావిడిలో భోజన ప్రియులకు చక్కటి ఆహారాన్ని అందించేందుకు బాబాయ్ హోటల్‌ హైద్రాబాద్‌కు వచ్చింది. కాగా ఈ హోటల్ ని స్టార్ హీరో నితిన్‌ చేతుల మీదుగా మణికొండలో ప్రారంభించారు.

Nithiin : స్టార్ హీరో నితిన్ చేతుల మీదుగా మణికొండలో ‘బాబాయ్ హోటల్’ ప్రారంభం..

nithin

Nithiin : ఎంత సంపాదించినా జానెడు పొట్ట నింపడం కోసమే, కోటి విద్యలు కూటి కొరకే అని అంటుంటారు. కానీ ఈ మధ్య కాలంలో మనం మంచి ఆహారాన్ని ఆస్వాదించడం, రుచికరమైన భోజనాన్ని తినడం చాలా కష్టంగా మారిపోయింది. ఇప్పుడున్న హడావిడిలో భోజన ప్రియులకు చక్కటి ఆహారాన్ని అందించేందుకు బాబాయ్ హోటల్‌ హైద్రాబాద్‌కు వచ్చింది. ఎనిమిది దశాబ్దాల నుంచి విజయవాడలో బాబోయ్ హోటల్ రుచికరమైన భోజనాన్ని అందిస్తూ తన స్థాయిని పెంచుకుంటూ వచ్చింది. ఇప్పుడు బాబాయ్ హోటల్ బ్రాంచ్‌ను స్టార్ హీరో నితిన్‌ చేతుల మీదుగా మణికొండలో ప్రారంభించారు.

Nithin : ‘జూనియర్’గా నితిన్.. మరో సినిమా లైన్లో..

డైరెక్టర్ శశికాంత్ తన స్నేహితులతో కలిసి ఫ్రెండ్స్ ఫ్యాక్టరీని స్థాపించారు. ఫ్రెండ్స్ ఫ్యాక్టరీ పేరు మీదే ఈ బాబాయ్ హోటల్‌ను హైద్రాబాద్‌లోని మణికొండకు తీసుకొచ్చారు. ఎనిమిది దశాబ్దాలుగా విజయవాడలో ప్రఖ్యాతి గాంచిన బాబాయ్ హోటల్‌ని మణికొండకి తీసుకురావడం సంతోషంగా ఉందని, అద్భుతమైన వంటకాలని చక్కటి శుచీ శుభ్రతలతో అందిస్తున్నామని హోటల్ నిర్వాహకులు తెలిపారు. ఒక్కసారి రుచి చూసిన వాళ్లు పర్మినెంట్‌ కస్టమర్లుగా మారుతారు అన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత సుధాకర్ రెడ్డి, డైరెక్టర్ వెంకీ కుడుముల, రామ జోగయ్య శాస్త్రి, రచయిత దర్శకుడు వక్కంతం వంశీ, నిర్మాత ఠాగూర్ మధు తదితరులు పాల్గొని బెస్ట్ విషెస్ తెలిపారు.

కాగా హీరో నితిన్ ఈ హోటల్ ఓపెనింగ్ లో ఆంజనేయ స్వామి ధీక్షలో కనిపించాడు. ప్రస్తుత ఈ హీరో వక్కంతం వంశీ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో మొదలైంది. ఈ మూవీలో నితిన్ గుబురు గడ్డంతో రఫ్ అండ్ రగ్గడ్ లుక్ లో కనిపించబోతున్నాడు. నితిన్ 32వ సినిమా వస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుని వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.