OnePlus 7 Software Update : వన్‌ప్లస్ 7 యూజర్లకు బ్యాడ్ న్యూస్.. ఈ రెండు మోడళ్లకు సాఫ్ట్‌వేర్ సపోర్టు ఉండదు.. కొత్త ఫోన్ కొనడమే బెటర్..!

OnePlus 7 Software Update : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ (OnePlus) స్మార్ట్‌ఫోన్ యూజర్లకు బ్యాడ్ న్యూస్.. వన్‌ప్లస్ కొన్ని మోడల్ లైనప్ ఫోన్లకు సాఫ్ట్‌వేర్ సపోర్టు నిలిచిపోనుంది. రాబోయే రోజుల్లో వన్‌ప్లస్ కంపెనీ రిలీజ్ చేసే కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ నిలిచిపోనున్నాయి.

OnePlus 7 Software Update : వన్‌ప్లస్ 7 యూజర్లకు బ్యాడ్ న్యూస్.. ఈ రెండు మోడళ్లకు సాఫ్ట్‌వేర్ సపోర్టు ఉండదు.. కొత్త ఫోన్ కొనడమే బెటర్..!

Bad news for OnePlus 7 or OnePlus 7T users, it is time to buy a new smartphone

OnePlus 7 Software Update : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ (OnePlus) స్మార్ట్‌ఫోన్ యూజర్లకు బ్యాడ్ న్యూస్.. వన్‌ప్లస్ కొన్ని మోడల్ లైనప్ ఫోన్లకు సాఫ్ట్‌వేర్ సపోర్టు నిలిచిపోనుంది. రాబోయే రోజుల్లో వన్‌ప్లస్ కంపెనీ రిలీజ్ చేసే కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ నిలిచిపోనున్నాయి. వన్‌ప్లస్ అత్యంత పాపులర్ అయిన రెండు లైనప్ ఫోన్లకు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ సపోర్టు నిలిపివేస్తోంది. అందులో OnePlus 7, OnePlus 7T మోడల్ ఉన్నాయి. ఈ మేరకు కమ్యూనిటీ వెబ్‌సైట్ ధృవీకరించింది. చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు ప్రకారం.. OxygenOS 12 MP3 బిల్డ్ OnePlus 7, OnePlus 7T సిరీస్‌ల రెండింటికీ చివరి అప్‌డేట్ అని చెప్పవచ్చు. OnePlus 7, 7T లైనప్ స్మార్ట్‌ఫోన్‌లకు కంపెనీ రెండు ఆండ్రాయిడ్ OS అప్‌గ్రేడ్‌లు, ఒక ఏడాది సెక్యూరిటీ అప్‌డేట్‌లను అందించింది.

OnePlus 7 సిరీస్ మే 2019లో ఆక్సిజన్ OS 9తో రిలీజ్ అయింది. అయితే OnePlus 7T సిరీస్ ఆక్సిజన్ OS 10 అవుట్-ఆఫ్-ది-బాక్స్‌తో మార్కెట్లోకి వచ్చింది. OnePlus 7, OnePlus 7T సిరీస్‌ల కోసం అప్‌డేట్‌లను నిలిపివేయాలనే నిర్ణయాన్నికమ్యూనిటీ ఫోరమ్‌ ద్వారా వెల్లడించింది. మెయింటెనెన్స్ షెడ్యూల్ ప్రకారం.. వన్‌ప్లస్ 7/7 ప్రో కోసం MP3 చివరి బిల్డ్ అవుతుంది. OnePlus 7 మోడల్ ఫోన్లను ఆదరించినందుకు అందరికీ ధన్యవాదాలంటూ కంపెనీ పోస్ట్‌లో పేర్కొంది.

Read Also : OnePlus 11 5G Launch : 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో వన్‌ప్లస్ 11 5G ఫోన్ వచ్చేస్తోంది.. ధర ఎంత? ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

స్మార్ట్‌ఫోన్ తయారీదారు ఇటీవల 2023 నుంచి రాబోయే ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ల కోసం కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ విధానాన్ని ప్రవేశపెట్టింది. OnePlus ఇంకా ప్రకటించని కొన్ని ఫ్లాగ్‌షిప్ డివైజ్‌లకు 4 సంవత్సరాల పాటు ప్రధాన Android అప్‌డేట్‌లను, ఐదేళ్లపాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లను అందించనున్నట్టు పేర్కొంది. గత ఏడాదిలో OnePlus 8 సిరీస్ తర్వాత లాంచ్ అయిన అన్ని డివైజ్‌లకు మూడు ప్రధాన Android అప్‌డేట్స్, 4 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్ లభిస్తాయని OnePlus ప్రకటించింది.

Bad news for OnePlus 7 or OnePlus 7T users, it is time to buy a new smartphone

Bad news for OnePlus 7 or OnePlus 7T users, it is time to buy a new smartphone

OnePlus 11 భారత్‌లో లాంచ్ :
OnePlus ప్రస్తుతం భారత మార్కెట్లో OnePlus 11ని లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. OnePlus 11 ఇప్పటికే చైనాలో అధికారికంగా లాంచ్ అయింది. ఆండ్రాయిడ్ 13 OSతో వస్తుంది. OnePlus 11 భారతీయ మోడల్ కూడా ఆండ్రాయిడ్ 13-ఆధారిత ఆక్సిజన్ OS కస్టమ్ స్కిన్ అవుట్-ఆఫ్-బాక్స్‌తో వస్తుందని భావిస్తున్నారు. OnePlus 11 ఫిబ్రవరి 7న భారత మార్కెట్లో లాంచ్ చేసేందుకు సిద్ధంగా ఉంది. భారతీయ మోడల్ స్పెక్స్ చైనీస్ వేరియంట్‌తో సమానంగా ఉంటాయి. OnePlus 11 Qualcomm Snapdragon 8 Gen 2 ప్రాసెసర్‌తో పాటు గరిష్టంగా 16GB RAM, 512GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో అందించనుందని స్పష్టంగా సూచిస్తుంది.

స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. OnePlus 11 6.7-అంగుళాల QHD+ E4 OLED LTPO 3.0 డిస్‌ప్లేతో 120Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్‌తో ప్యాక్ అయింది. వెనుక ప్యానెల్‌లో ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంది. 50-MP సోనీ IMX890 కెమెరా OIS + 48-MP సోనీ IMX581 అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా, 32-MP సోనీ IMX709 2x టెలిఫోటో కెమెరా ఉన్నాయి.

ఫోన్ ముందు భాగంలో సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం 16-MP కెమెరాను కలిగి ఉంది. ఫోన్ 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీతో సపోర్టు ఇస్తుంది. చైనాలో, OnePlus 11 ప్రారంభ ధర RMB 3999 వద్ద లాంచ్ అయింది. బేస్ 12GB + 256GB మోడల్ కోసం దాదాపు రూ. 48వేలకి వస్తుంది. OnePlus 11 భారతీయ ధర ఇంకా ధృవీకరించబడలేదు. కానీ, లీక్‌ల ప్రకారం.. రూ. 55వేలు, రూ. 60,000 మధ్య ఉంటాయని చెప్పవచ్చు.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Airtel 5G Plus Services : దేశంలో 22 నగరాల్లో ఎయిర్‌టెల్ 5G ప్లస్ సర్వీసులు.. ఫుల్ లిస్టు ఇదిగో.. 5G నెట్‌వర్క్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలంటే?