Airtel 5G Plus Services : దేశంలో 22 నగరాల్లో ఎయిర్‌టెల్ 5G ప్లస్ సర్వీసులు.. ఫుల్ లిస్టు ఇదిగో.. 5G నెట్‌వర్క్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలంటే?

Airtel 5G Plus Services : భారత్‌లో వేగంగా 5G నెట్‌వర్క్ విస్తరిస్తోంది. అక్టోబర్ 2022లో ప్రారంభమైనప్పటి నుంచి టెలికాం ఆపరేటర్లు ఢిల్లీ, ముంబై, వారణాసి, మరిన్ని సహా 50కి పైగా భారతీయ నగరాల్లో 5G నెట్‌వర్క్‌ను ప్రవేశపెట్టాయి.

Airtel 5G Plus Services : దేశంలో 22 నగరాల్లో ఎయిర్‌టెల్ 5G ప్లస్ సర్వీసులు.. ఫుల్ లిస్టు ఇదిగో.. 5G నెట్‌వర్క్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలంటే?

Airtel 5G launched in 22 India cities _ Full list of cities, how to activate 5G on smartphone

Airtel 5G Plus Services : భారత్‌లో వేగంగా 5G నెట్‌వర్క్ విస్తరిస్తోంది. అక్టోబర్ 2022లో ప్రారంభమైనప్పటి నుంచి టెలికాం ఆపరేటర్లు ఢిల్లీ, ముంబై, వారణాసి, మరిన్ని సహా 50కి పైగా భారతీయ నగరాల్లో 5G నెట్‌వర్క్‌ను ప్రవేశపెట్టాయి. ప్రస్తుతం 5G సర్వీసులను అందిస్తున్న రెండు టెలికాం ఆపరేటర్‌లలో Airtel, Jio తమ 5G సర్వీసులను 1-2 ఏళ్లలో పాన్ ఇండియా దిశగా ప్రవేశపెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఎయిర్‌టెల్ (Airtel) ప్లస్ 5G సర్వీసులను మరిన్ని నగరాల్లో ప్రారంభించింది. ఈసారి హర్యానాలోని మరిన్ని నగరాలను 5G సర్వీసులను అందుబాటులోకి తీసుకురానుంది.

Airtel 5G ప్లస్ సర్వీసుల్లో 5వ జనరేషన్ నెట్‌వర్క్ కనెక్టివిటీతో హిసార్, రోహ్‌తక్‌లలో అందుబాటులో ఉంది. గతంలో ఎయిర్‌టెల్ గురుగ్రామ్, పానిపట్‌లలో 5G సర్వీసులను ప్రారంభించింది. 5G కనెక్షన్ పొందాలంటే.. టెలికాం ఆపరేటర్ తమ యూజర్లకు కొత్త 5G SIM కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని తెలిపింది. ఇప్పటికే ఉన్న 4G SIM ఆటోమేటిక్‌గా 5Gకి అప్‌గ్రేడ్ అవుతాయి.

Read Also : Jio Airtel 5G in India : దేశవ్యాప్తంగా ఎయిర్‌టెల్, జియో 5G సర్వీసులు.. ఏయే నగరాల్లో 5G నెట్‌వర్క్ ఉందంటే? మీ ఫోన్లలో ఇలా ఫ్రీగా యాక్సస్ చేసుకోవచ్చు!

ఎయిర్‌టెల్ నాన్-స్టాండలోన్ 5G నెట్‌వర్క్‌తో యూజర్లు అల్ట్రాఫాస్ట్ 5G ప్లస్ సర్వీసుల ఇంటర్నెట్‌ను వినియోగించుకోవచ్చునని కూడా పేర్కొంది. ఎయిర్‌టెల్ 5G సర్వీసుల్లో ప్రస్తుతం విజయ్ నగర్, రసోమా చౌక్, బాంబే హాస్పిటల్ స్క్వేర్, రాడిసన్ స్క్వేర్, ఖజ్రానా ఏరియా, సదర్ బజార్, గీతా భవన్, పంచశీల్ నగర్, అభినందన్ నగర్, పత్రకర్ కాలనీ, యశ్వంత్ రోడ్, ఫీనిక్స్ సిటాడెల్‌లో అందుబాటులో ఉన్నాయని ప్రకటించింది.

Airtel 5G launched in 22 India cities _ Full list of cities, how to activate 5G on smartphone

Airtel 5G Plus Services : Airtel 5G launched in 22 India cities

Airtel 5G నగరాల పూర్తి లిస్టు ఇదే :

* ఢిల్లీ
* ముంబై
* చెన్నై
* బెంగళూరు
* హైదరాబాద్
* సిలిగురి
* నాగపూర్
* వారణాసి
* పానిపట్
* గుర్గావ్
* గౌహతి
* పాట్నా
* లక్నో
* సిమ్లా
* ఇంఫాల్
* అహ్మదాబాద్
* వైజాగ్
* పూణే
* ఇండోర్
* భువనేశ్వర్
* హిసార్
* రోహ్‌టక్

Airtel 5Gకి ఎలా కనెక్ట్ చేయాలంటే? :
ఎయిర్‌టెల్ 5G సర్వీసులను దశలవారీగా విస్తరిస్తోంది. 5G నెట్‌వర్క్ దేశంలో అందుబాటులోకి ఉన్నప్పటికీ.. పూర్తిగా అన్ని ప్రాంతాల్లో అందుబాటులో తీసుకురావడానికి మరికొంత సమయం పడుతుంది. మీ ప్రాంతంలో Airtel 5G అందుబాటులో ఉందో లేదో చెక్ చేయడానికి యూజర్లు Airtel యాప్‌ను డౌన్‌లోడ్ చేయాలి. ఆపై యాప్ లాగిన్ చేసి 5G నెట్‌వర్క్ చెక్ చేయవచ్చు. 5Gని ఉపయోగించేందుకు 5G స్మార్ట్‌ఫోన్‌ని ఉపయోగిస్తున్నారని నిర్ధారించుకోండి. ఎయిర్‌టెల్ భారత అంతటా 5Gని అమలు చేసే వరకు, 5G సర్వీసులను ఉచితంగా అందిస్తోంది.

వినియోగదారులు ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా వేగవంతమైన ఇంటర్నెట్‌ను ఉపయోగించవచ్చు. ఇంతలో, అనేక OEM అంటే.. స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు ఇటీవల Airtel, Jio 5G సర్వీసుల కోసం 5G సపోర్టును అందించినందున టెలికాం ఆపరేటర్ లేటెస్ట్ సిస్టమ్ సాఫ్ట్‌వేర్‌కు అప్‌గ్రేడ్ చేయాలని సూచించారు. మీ ఫోన్ 5Gని రెడీ చేసేందుకు Settings> About Phone>కి వెళ్లి, System Updateని చెక్ చేసి డౌన్‌లోడ్ చేయండి.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Airtel Postpaid Plans : ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ప్లాన్లతో బోరు కొట్టేసిందా? పోస్టు‌పెయిడ్ ప్లాన్లపై అదిరే ఆఫర్లు.. అన్‌లిమిటెడ్ కాలింగ్, మరెన్నో డేటా బెనిఫిట్స్..!