Balagam Movie: థియేటర్స్, ఓటీటీ తరువాత బుల్లితెరపై బలం చూపెట్టేందుకు రెడీ అయిన బలగం..!

ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ‘బలగం’ మూవీ ఎంతటి ఘనవిజయాన్ని అందుకుందో మనం చూశాం. ఇప్పుడు ఈ సినిమా బుల్లితెరపై సత్తా చాటేందుకు రెడీ అయ్యింది.

Balagam Movie: థియేటర్స్, ఓటీటీ తరువాత బుల్లితెరపై బలం చూపెట్టేందుకు రెడీ అయిన బలగం..!

Balagam Movie Locks World Television Premiere Date

Balagam Movie: టాలీవుడ్‌లో రీసెంట్‌గా వచ్చిన బలగం మూవీ గురించి అందరికీ తెలిసిందే. చిన్న సినిమాగా ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ మూవీ, ఎమోషనల్ కంటెంట్‌తో ప్రేక్షకులను కట్టిపడేసింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సెన్సేషనల్ హిట్‌గా నిలిచి కమర్షియల్‌గానూ భారీ విజయాన్ని అందుకుంది. జబర్దస్త్ ఫేం వేణు వెల్దండి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయగా.. ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్‌లు హీరోహీరోయిన్లుగా నటించారు.

Balagam Movie: మరో ఇంటర్నేషనల్ అవార్డును దక్కించుకున్న బలగం మూవీ

ఇక ఈ సినిమాను చాలా త్వరగా ఓటీటీలోనూ రిలీజ్ చేయగా, అందులోనూ ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ప్రతి ఊరువాడలలో ఈ సినిమాను భారీ స్క్రీన్స్‌లో ప్రదర్శించి ఈ చిత్రానికి అదిరిపోయే రెస్పాన్స్‌ను అందించారు. ఇక ఇప్పుడు ఈ సినిమా మరోసారి తన సత్తా చాటేందుకు రెడీ అయ్యింది. అయితే, ఈసారి బుల్లితెర ప్రేక్షకులను ఏడిపించేందుకు బలగం మూవీ సిద్ధమయ్యింది.

Balagam Movie: అంతర్జాతీయ వేదికపై సత్తా చాటిన ‘బలగం’.. ఏకంగా రెండు అవార్డులు!

ఈ సినిమాను స్టార్ మా ఛానల్‌లో మే 7న సాయంత్రం 6 గంటలకు టెలికాస్ట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా వస్తున్న బలగం మూవీకి బుల్లితెర ప్రేక్షకులు ఎలాంటి రెస్పాన్స్‌ను అందిస్తారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాను దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హన్షితా రెడ్డి, హర్షిత్ రెడ్డి సంయుక్తంగా ప్రొడ్యూస్ చేశారు.