Balagam Movie: అంతర్జాతీయ వేదికపై సత్తా చాటిన ‘బలగం’.. ఏకంగా రెండు అవార్డులు!

కమెడియన్ వేణు డైరెక్టర్‌గా మారి చేసిన సినిమా ‘బలగం’. తాజాగా బలగం సినిమా ప్రపంచవేదికపై సత్తా చాటింది. లాస్ ఏంజిల్స్ సినిమాటోగ్రఫీ అవార్డ్స్‌లో బలగం సినిమాకు ఏకంగా రెండు అవార్డులు దక్కాయి.

Balagam Movie: అంతర్జాతీయ వేదికపై సత్తా చాటిన ‘బలగం’.. ఏకంగా రెండు అవార్డులు!

Balagam Movie Grabs Two Awards At Los Angeles Cinematography Awards

Updated On : March 31, 2023 / 7:57 AM IST

Balagam Movie: కమెడియన్ వేణు డైరెక్టర్‌గా మారి చేసిన సినిమా ‘బలగం’. రిలీజ్‌కు ముందు పెద్దగా అంచనాలు లేని ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద ఓ చిన్న సినిమాగా మార్చి 3న రిలీజ్ అయ్యింది. అయితే, విడుదల తరువాత మాత్రం ‘బలగం’ బడా సినిమాలకు ఏమాత్రం తీసిపోకుండా, బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో తెరకెక్కిన బలగం సినిమాను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టారు.

Balagam Movie: ‘బలగం’ సినిమాలో ప్రియదర్శి కంటే ముందు అతడిని అనుకున్నారా..?

దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమాకు జనం బాగా కనెక్ట్ అయ్యారు. ఫలితంగా ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఇక ఇటీవల ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. అయినా కూడా ఈ సినిమాను థియేటర్లలో చూసేందుకు జనం ఇంకా థియేటర్లకు వెళ్తున్నారు. ఇక తాజాగా బలగం సినిమా ప్రపంచవేదికపై సత్తా చాటింది. లాస్ ఏంజిల్స్ సినిమాటోగ్రఫీ అవార్డ్స్‌లో బలగం సినిమాకు ఏకంగా రెండు అవార్డులు దక్కాయి. ఈమేరకు బలగం సినిమా హీరో ప్రియదర్శి తన సోషల్ మీడియా అకౌంట్‌లో ఈ విషయాన్ని పోస్ట్ చేశాడు.

Balagam Movie: ఓటీటీలోనూ దుమ్ములేపుతున్న బలగం.. బలంగా మారిన మౌత్ టాక్!

లాస్ ఏంజిల్స్ సినిమాటోగ్రఫీ అవార్డ్స్‌లో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్, బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ సినిమాటోగ్రఫీ అవార్డులను బలగం గెలుచుకుంది. ఇలా ప్రపంచవేదికపై బలగం సినిమా సత్తా చాటడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సినిమాలో ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ హీరోహీరోయిన్లుగా నటించగా, భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతం అందించాడు.