Balagam Movie: ఓటీటీలోనూ దుమ్ములేపుతున్న బలగం.. బలంగా మారిన మౌత్ టాక్!

కమెడియన్ వేణు దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కించిన చిత్రం ‘బలగం’. ఈ సినిమాను మార్చి 3న మంచి అంచనాల మధ్య రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఈ సినిమా థియేటర్లలో ఇంకా సాలిడ్ రన్‌తో దూసుకెళ్తుండటంతో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది.

Balagam Movie: ఓటీటీలోనూ దుమ్ములేపుతున్న బలగం.. బలంగా మారిన మౌత్ టాక్!

Balagam Movie Shows Rampage In OTT

Updated On : March 26, 2023 / 8:56 PM IST

Balagam Movie: కమెడియన్ వేణు దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కించిన చిత్రం ‘బలగం’. ఈ సినిమాను మార్చి 3న మంచి అంచనాల మధ్య రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఎమోషనల్ కంటెంట్‌ను తెలంగాణ నేపథ్యంలో దర్శకుడు తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ కావడంతో ఈ చిత్రానికి వారు బ్రహ్మరథం పట్టారు. థియేటర్లలో ఈ సినిమాను చూసేందుకు ఫ్యామిలీ ఆడియెన్స్ క్యూ కట్టారు. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించి నిర్మాతలకు మంచి లాభాలను తెచ్చిపెట్టింది.

Balagam Movie: మూడు వారాల్లోనే ఓటీటీలో బలగం.. అసలు మ్యాటర్ ఇదేనా..?

కాగా, ఈ సినిమా థియేటర్లలో ఇంకా సాలిడ్ రన్‌తో దూసుకెళ్తుండటంతో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది. అయితే అందరికీ షాకిస్తూ, ఈ సినిమాను ఇటీవల ఓటీటీలో స్ట్రీమింగ్‌కు తీసుకొచ్చారు. ప్రైమ్ వీడియోలో బలగం మూవీ స్ట్రీమింగ్ కావడంతో ప్రేక్షకులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఇక ఈ సినిమాను థియేటర్లలో చూడని వారు పెద్ద సంఖ్యలో ఓటీటీ వీక్షిస్తున్నారు. దీంతో ఈ సినిమాకు ఓటీటీలోనూ ట్రెమెండస్ రెస్పాన్స్ దక్కుతోంది.

Balagam Movie: ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చిన బలగం.. అంత లేదంటూ ట్వీట్ చేసిన హీరోహీరోయిన్!

ప్రైమ్ వీడియోలో ఈ సినిమాకు వస్తున్న వ్యూయర్‌షిప్‌తో ఈ సినిమా ఇండియా ప్రైమ్ వీడియో చార్ట్స్‌‌లో టాప్ రెండో ప్లేస్‌లో దూసుకెళ్తోంది. ఈ సినిమాకు మౌత్ టాక్ కారణంగానే ఓటీటీలోనూ అదిరిపోయే రెస్పాన్స్ దక్కుతోందని తెలుస్తోంది. ఇలా థియేటర్లతో పాటు ఓటీటీలోనూ దుమ్ములేపుతోన్న బలగం సినిమా మున్ముందు ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందా అని ఓటీటీ ప్రేక్షకులు చూస్తున్నారు. ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించాడు.