Balagam Movie: ‘బలగం’ సినిమాలో ప్రియదర్శి కంటే ముందు అతడిని అనుకున్నారా..?

బలగం సినిమాలో సాయిలు అనే పాత్రలో ప్రియదర్శి నటించాడు. తొలుత ఈ పాత్రలో ప్రియదర్శి కాకుండా దర్శకుడు వేణునే నటించాలని అనుకున్నారట.

Balagam Movie: ‘బలగం’ సినిమాలో ప్రియదర్శి కంటే ముందు అతడిని అనుకున్నారా..?

This Actor Was To Play Sailu Role Befor Priyadarshi In Balagam Movie

Balagam Movie: చిన్న సినిమాగా తెరకెక్కి.. మంచి అంచనాలతో రిలీజ్ అయిన ‘బలగం’ బాక్సాఫీస్ వద్ద కళ్లుచెదిరే వసూళ్లను రాబట్టి భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. కమెడియన్ వేణు వెల్దండి తెరకెక్కించిన ఈ ఎమోషనల్ మూవీని చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టారు. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియెన్స్‌ను బాగా ఇంప్రెస్ చేసింది. దీంతో ఈ సినిమాకు జనం పట్టం కట్టారు.

Balagam Movie: ఓటీటీలోనూ దుమ్ములేపుతున్న బలగం.. బలంగా మారిన మౌత్ టాక్!

ఇక బాక్సాఫీస్ వద్ద లాభాల పంటను పండించిన బలగం, ప్రస్తుతం ఓటీటీలోనూ స్ట్రీమింగ్ అవుతోంది. అయినా కూడా ఈ సినిమాను థియేటర్లలో చూసేందుకు జనం ఆసక్తిని చూపుతుండటం విశేషం. ఈ సినిమాకు సంబంధించి చిత్ర యూనిట్ పలు ఇంట్రెస్టింగ్ విషయాలను ఇంకా రివీల్ చేస్తూ, జనంలో ఈ సినిమాపై ఆసక్తిని కంటిన్యూ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో హీరోగా నటించిన ప్రియదర్శి పాత్రకు సంబంధించి ఓ వార్త జోరుగా వినిపిస్తోంది. బలగం సినిమాలో సాయిలు అనే పాత్రలో ప్రియదర్శి నటించాడు.

Balagam Movie: మూడు వారాల్లోనే ఓటీటీలో బలగం.. అసలు మ్యాటర్ ఇదేనా..?

అయితే, తొలుత ఈ పాత్రలో ప్రియదర్శి కాకుండా దర్శకుడు వేణునే నటించాలని అనుకున్నారట. కానీ, ఈ పాత్ర కోసం ప్రియదర్శిని ఎంపిక చేశాడట నిర్మాత దిల్ రాజు. దీంతో సాయిలు పాత్ర తనకు వచ్చిందని.. ఒకవేళ వేణు ఈ పాత్రను చేసుంటే, బలగం అనే ఓ చక్కటి సినిమాలో తాను నటించలేకపోయే వాడినని ప్రియదర్శి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. బలగం లాంటి బలమైన కథ ఉన్న సినిమాకు ప్రేక్షకులు నీరాజనాలు పడుతుండటం సంతోషాన్ని కలిగించిందని చిత్ర యూనిట్ తెలిపింది. ఇక ఈ సినిమాలో కావ్య కళ్యాణ్ రామ్ హీరోయిన్‌గా నటించింది.