Balagam Movie: అర్ధరాత్రి సర్ప్రైజ్ ఇవ్వనున్న ‘బలగం’ మూవీ..!
టాలీవుడ్లో కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలకు ప్రేక్షకులు ఎప్పుడూ నీరాజనాలు పలుకుతారని మరోసారి నిరూపించారు. ఇటీవల రిలీజ్ అయిన ‘బలగం’ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాను కమెడియన్ వేణు డైరెక్ట్ చేయడటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అని సినీ వర్గాల్లో ఒకింత టాక్ వినిపించింది. అయితే ఈ సినిమాకు స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రమోషన్స్ ఈ చిత్రాన్ని ఒక్కసారిగా నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లాయి.
Balagam Movie: టాలీవుడ్లో కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలకు ప్రేక్షకులు ఎప్పుడూ నీరాజనాలు పలుకుతారని మరోసారి నిరూపించారు. ఇటీవల రిలీజ్ అయిన ‘బలగం’ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాను కమెడియన్ వేణు డైరెక్ట్ చేయడటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అని సినీ వర్గాల్లో ఒకింత టాక్ వినిపించింది. అయితే ఈ సినిమాకు స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రమోషన్స్ ఈ చిత్రాన్ని ఒక్కసారిగా నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లాయి.
Balagam Movie Collections : అదిరిపోయిన బలగం సినిమా కలక్షన్స్.. ఫుల్ ప్రాఫిట్స్..
దీంతో ఈ సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఇక రిలీజ్ అయిన అన్ని చోట్లా ఈ సినిమాకు ట్రెమెండస్ రెస్పాన్స్ రావడటంతో ఈ సినిమాను చూసేందుకు జనం థియేటర్లకు క్యూ కట్టారు. ప్యామిలీ ఎమోషన్స్‌ను అత్యద్భుతంగా చూపెట్టిన మూవీగా ‘బలగం’ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఫలితంగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సర్ప్రైజ్ హిట్‌గా నిలిచింది. మార్చి 3న రిలీజ్ అయిన బలగం సినిమా రోజురోజుకూ థియేటర్ల సంఖ్యను పెంచుకుంటూ వెళ్లింది.
Balagam : బలగం టీంకి చిరంజీవి సన్మానం..
ఇక ఈ సినిమా రిలీజ్ అయిన 19 రోజుల్లో ఏకంగా రూ.19 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి నిర్మాతలకు డబుల్ ప్రాఫిట్స్ను అందించింది. థియేటర్లలో ఇంకా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్న ఈ సినిమా, ఇప్పుడు ఓటీటీ ఆడియెన్స్‌కు కూడా సర్ప్రైజ్ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. ఈ సినిమాను మార్చి 24 నుండి ప్రైమ్ వీడియో, సింప్లీ సౌత్(ఇండియా బయట)లో స్ట్రీమింగ్కు రెడీ అయ్యింది. అంటే.. ఇవాళ అర్ధరాత్రి నుండే బలగం సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుండటంతో ఈ సినిమాను చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ హీరోహీరోయిన్లుగా నటించగా, భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతాన్ని అందించాడు.