Balagam Movie Collections : అదిరిపోయిన బలగం సినిమా కలక్షన్స్.. ఫుల్ ప్రాఫిట్స్..

బలగం సినిమా కేవలం 1.30 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. 2 కోట్ల షేర్ కలెక్షన్స్ వసూలు చేస్తే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయినట్టే. సినిమా బాగుంది అని టాక్ రావడంతో భారీగా ప్రేక్షకులు వచ్చారు. తెలంగాణ కథ అని చెప్పడంతో నైజాంలో మరిన్ని కలెక్షన్స్ వచ్చాయి. బలగం సినిమా రెండు వారాలకు గాను...................

Balagam Movie Collections : అదిరిపోయిన బలగం సినిమా కలక్షన్స్.. ఫుల్ ప్రాఫిట్స్..

Balagam Movie Collections getting huge profits

Updated On : March 18, 2023 / 10:08 AM IST

Balagam Movie Collections :  ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ జంటగా కమెడియన్ వేణు మొదటిసారి దర్శకుడిగా మారి తెరకెక్కించిన సినిమా బలగం. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై దిల్ రాజు కూతురు హన్షిత రెడ్డి ఈ సినిమాని నియమించింది. ఈ సినిమాకి ప్రమోషన్స్ చాలా గ్రాండ్ గా చేశారు. బలగం సినిమా రిలీజ్ తర్వాత మంచి సినిమా అని ప్రేక్షకులు, సినీ, రాజకీయ ప్రముఖులు కూడా స్పందించి చిత్రయూనిట్ ని అభినందించారు. చిన్న సినిమాగా బలగం సినిమా ఫిబ్రవరి 3న థియేటర్స్ లో రిలీజ్ అయి ఫుల్ పాజిటివ్ టాక్ తెచ్చుకొని మంచి విజయం సాధించింది. కొన్ని సన్నివేశాలలో ఎమోషన్ సీన్స్ తో ప్రేక్షకులకు కన్నీళ్లు తెప్పించారు.

సినిమా మంచి విజయం సాధించడంతో చిత్రయూనిట్ కూడా ఫుల్ సంతోషంలో ఉన్నారు. ఇప్పటికే బలగం సినిమా సక్సెస్ ఈవెంట్ కూడా గ్రాండ్ గా చేశారు. ఇప్పుడు బలగం సినిమా కలెక్షన్స్ అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి. ఈ సినిమాలో అందరూ చిన్న ఆర్టిస్టులు, కొత్తవాళ్లు ఉండటం, చాలా వరకు ఒకే ఊర్లోనే షూట్ అవ్వడంతో చాలా తక్కువ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది.

RGV : శివ సినిమా క్లైమాక్స్ ఆ బిల్డింగ్ పైనే షూట్ చేశాను.. స్వప్నలోక్ అగ్నిప్రమాదంపై ఆర్జీవీ వ్యాఖ్యలు..

బలగం సినిమా కేవలం 1.30 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. 2 కోట్ల షేర్ కలెక్షన్స్ వసూలు చేస్తే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయినట్టే. సినిమా బాగుంది అని టాక్ రావడంతో భారీగా ప్రేక్షకులు వచ్చారు. తెలంగాణ కథ అని చెప్పడంతో నైజాంలో మరిన్ని కలెక్షన్స్ వచ్చాయి. బలగం సినిమా రెండు వారాలకు గాను నైజాంలో 9 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఏపీలో మొత్తం 5 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. మొత్తంగా బలగం సినిమా రెండు రాష్ట్రాలు, ఓవర్సీస్ కలిపి దాదాపు 15 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. అంటే దాదాపు 8 కోట్ల షేర్ కలెక్షన్స్ వసూలు చేసి ఫుల్ ప్రాఫిట్స్ తో బలగం సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. చిన్న బడ్జెట్ తో తీసిన బలగం సినిమా ఈ రేంజ్ లో ప్రాఫిట్స్ వస్తుండటంతో దిల్ రాజు కూతురు హన్షిత రెడ్డి సంతోషం వ్యక్తం చేస్తోంది.