NBK108: NBK108 ముహూర్తం ఫిక్స్ చేసిన బాలయ్య అండ్ టీమ్!

‘వీరసింహారెడ్డి’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు నందమూరి బాలకృష్ణ రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ డేట్‌ను కూడా లాక్ చేశారు చిత్ర యూనిట్. దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీలో బాలయ్య పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ ఇవ్వనున్నట్లు ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్ వీడియో చూస్తే అర్థమవుతోంది. ఇక ఈ సినిమా రిలీజ్ కాకముందే, తన నెక్ట్స్ మూవీని యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో ఓకే చేశాడు ఈ స్టార్ హీరో.

NBK108: NBK108 ముహూర్తం ఫిక్స్ చేసిన బాలయ్య అండ్ టీమ్!

Balakrishna Anil Ravipudi Movie NBK108 Muhurtham Time Fixed

NBK108: ‘వీరసింహారెడ్డి’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు నందమూరి బాలకృష్ణ రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ డేట్‌ను కూడా లాక్ చేశారు చిత్ర యూనిట్. దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీలో బాలయ్య పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ ఇవ్వనున్నట్లు ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్ వీడియో చూస్తే అర్థమవుతోంది. ఇక ఈ సినిమా రిలీజ్ కాకముందే, తన నెక్ట్స్ మూవీని యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో ఓకే చేశాడు ఈ స్టార్ హీరో.

NBK108: బాలయ్య ‘చెన్నకేశవరెడ్డి’ కాన్సెప్ట్‌తో రానున్న అనిల్ రావిపూడి మూవీ..?

అయితే ఈ సినిమాను అనౌన్స్ చేసి రోజులు గడుస్తున్నా, ఇప్పటివరకు ఈ సినిమాను ప్రారంభించలేదు. దీంతో అనిల్ రావిపూడితో బాలయ్య సినిమా ఎప్పుడెప్పుడు పట్టాలెక్కుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. కాగా, తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ అదిరిపోయే అప్డేట్‌ను చిత్ర యూనిట్ రివీల్ చేసింది. బాలయ్య కెరీర్‌లో 108వ చిత్రంగా రానున్న ఈ సినిమాకు సంబంధించిన ముహూర్తం డేట్ అండ్ టైమ్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేసింది.

NBK108: బాలయ్య నెక్ట్స్ మూవీ ప్రారంభమయ్యేది ఆ రోజునే..?

NBK108 సినిమాకు సంబంధించిన ప్రారంభోత్సవ ముహూర్తం డిసెంబర్ 8న ఉదయం 9.36 గంటలకు ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో బాలయ్యను సరికొత్త పాత్రలో మనకు చూపించబోతున్నాడట దర్శకుడు అనిల్ రావిపూడి. ఇక ఈ సినిమాలో బాలయ్య కూతురి పాత్రలో యంగ్ బ్యూటీ శ్రీలీల నటించబోతున్నట్లు ఇప్పటికే చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ ప్రొడ్యూస్ చేస్తోండగా థమన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు.