NBK108: బాలయ్య ‘చెన్నకేశవరెడ్డి’ కాన్సెప్ట్‌తో రానున్న అనిల్ రావిపూడి మూవీ..?

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం ‘వీరసింహారెడ్డి’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఇక ఈ సినిమా రిలీజ్ కాకముందే బాలయ్య తన నెక్ట్స్ మూవీని యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించారు.

NBK108: బాలయ్య ‘చెన్నకేశవరెడ్డి’ కాన్సెప్ట్‌తో రానున్న అనిల్ రావిపూడి మూవీ..?

NBK108 Movie To Have Balakrishna Chennakeshava Reddy Background

NBK108: నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం ‘వీరసింహారెడ్డి’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఈ సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తుండగా, ఇటీవల ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ సాంగ్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ‘జై బాలయ్య’ అంటూ సాగే ఈ ఫస్ట్ సింగిల్ సాంగ్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కుతోంది. ఇక ఈ సినిమా రిలీజ్ కాకముందే బాలయ్య తన నెక్ట్స్ మూవీని యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించారు.

NBK108: బాలయ్య నెక్ట్స్ మూవీ ప్రారంభమయ్యేది ఆ రోజునే..?

దీంతో అనిల్ రావిపూడి బాలయ్య కోసం ఎలాంటి కథను రెడీ చేశాడా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. అయితే తాజాగా ఈ సినిమా కథకు సంబంధించి సినీ వర్గాల్లో ఓ వార్త జోరుగా చక్కర్లు కొడుతోంది. అనిల్ రావిపూడి బాలయ్య కోసం రెడీ చేస్తున్న కథలో ‘చెన్నకేశవ రెడ్డి’ ఛాయలు కనిపించబోతున్నాయట. ఈ సినిమా కథలో 35 ఏళ్ల హీరో ఆవేశంతో చేసే గొడవల వలన అతడికి 14 ఏళ్ల పాటు శిక్ష పడుతుంది. అలా జైలు నుంచి 50 ఏళ్ల వయసులో బయటకు వచ్చిన హీరో జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది ఈ సినిమా కథ అని తెలుస్తోంది.

Release Date Locked For NBK108: బాలయ్య కూడా దూకుడు చూపిస్తున్నాడుగా.. అప్పుడే 108కి డేట్ ఫిక్స్..?

గతంలో చెన్నకేశవ రెడ్డి సినిమాలో కూడా హీరో శిక్ష అనిభవించి వస్తాడు. ఇప్పుడు అనిల్ రావిపూడి తన సినిమాలో కూడా ఇలాంటి నేపథ్యాన్ని వాడుతుండటంతో ఈ సినిమాలో బాలయ్య లుక్ ఎలా ఉండబోతుందా అని అభిమానులు అప్పుడే ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కాగా, ఈ చిత్ర షూటింగ్‌ను డిసెంబర్ 8న ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.