Peddi Trailer : నేడే ‘పెద్ది’ ట్రైలర్ లాంచ్.. భారీ ఈవెంట్.. ఎప్పుడు? ఎక్కడ?
నేడు పెద్ది సినిమా ట్రైలర్ రిలీజ్ అవ్వనుంది.(Peddi Trailer)
Peddi Trailer
Peddi Trailer : రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. జూన్ 4న ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ భారీగా రిలీజ్ కానుంది. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో భారీగా పీరియాడిక్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ.. పలువురు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు పాటలు, రెండు గ్లింప్స్ వచ్చాయి. వీటితోనే ఈ సినిమాపై భారీ హైప్ నెలకొంది. నేడు పెద్ది సినిమా ట్రైలర్ రిలీజ్ అవ్వనుంది. దీనికి సంబంధించి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ బాలీవుడ్ లో ముంబైలో గ్రాండ్ గా చేయబోతున్నారు. ముంబైలోని జియో వరల్డ్ డ్రైవ్ సెంటర్ లో సాయంత్రం 3 గంటల నుంచి ఈ ఈవెంట్ జరగనుంది.
Also Read : Rashmika Mandanna : కాక్ టైల్ 2 సాంగ్ లాంచ్ ఈవెంట్.. బాలీవుడ్ లో సందడి చేసిన రష్మిక మందన్న.. ఫొటోలు..
ఈ ఈవెంట్లో చరణ్, జాన్వీ కపూర్, బుచ్చిబాబుతో పాటు పలువురు బాలీవుడ్ ప్రముఖులు కూడా హాజరు కానున్నారు. ఇక పెద్ది ట్రైలర్ నేడు సాయంత్రం రిలీజ్ అవ్వనుంది. ఫ్యాన్స్ పెద్ది ట్రైలర్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
పెద్ది సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లైవ్ ఇక్కడ చూసేయండి..
