NBK108: బాలయ్య నెక్ట్స్ మూవీ ప్రారంభమయ్యేది ఆ రోజునే..?

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం ‘వీరసింహారెడ్డి’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తుండగా, పూర్తి ఫ్యాక్షన్ నేపథ్యంలో ఈ సినిమా వస్తున్నట్లుగా చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా రిలీజ్ కాకముందే, తన నెక్ట్స్ ప్రాజెక్టును బాలయ్య మరో యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో తెరకెక్కించేందుకు సిద్ధమయ్యాడు.

NBK108: బాలయ్య నెక్ట్స్ మూవీ ప్రారంభమయ్యేది ఆ రోజునే..?

Balakrishna Anil Ravipudi NBK108 Project To Launch On This Date

NBK108: నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం ‘వీరసింహారెడ్డి’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తుండగా, పూర్తి ఫ్యాక్షన్ నేపథ్యంలో ఈ సినిమా వస్తున్నట్లుగా చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ సినిమాలో బాలయ్య మరోసారి ఊరమాస్ అవతారంలో కనిపిస్తుండటంతో థియేటర్లలో సందడి చేసేందుకు బాలయ్య అభిమానులు రెడీ అవుతున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్స్, వీడియో గ్లింప్స్ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది.

Release Date Locked For NBK108: బాలయ్య కూడా దూకుడు చూపిస్తున్నాడుగా.. అప్పుడే 108కి డేట్ ఫిక్స్..?

ఇక ఈ సినిమాను సంక్రాంతి బరిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతుండగా, ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. కాగా ఈ సినిమా రిలీజ్ కాకముందే, తన నెక్ట్స్ ప్రాజెక్టును బాలయ్య మరో యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో తెరకెక్కించేందుకు సిద్ధమయ్యాడు. ఈ సినిమాను ఇప్పటికే అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. దీంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు లాంచ్ చేస్తారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమాను డిసెంబర్ 8వ తేదీన లాంఛ్ చేయబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.

NBK108: అఫీషియల్.. బాలయ్యతో సినిమా కన్ఫం చేసిన అనిల్ రావిపూడి!

ఆ తరువాత రెగ్యులర్ షూటింగ్‌ను కూడా వీలైనంత త్వరగా మొదలుపెట్టేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోందట. ఈ సినిమాలో బాలయ్య విభిన్నమైన గెటప్‌లో కనిపిస్తాడని అనిల్ రావిపూడి ఇప్పటికే ప్రకటించాడు. అయితే ఈ సినిమాలో బాలయ్య డ్యుయల్ రోల్ చేస్తారని, అందులో ఒకటి తండ్రి పాత్ర కాగా ఆయనకు కూతురిగా యంగ్ బ్యూటీ శ్రీలీలా నటిస్తుందనే వార్త ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో చూడాలి అంటున్నారు బాలయ్య అభిమానులు.