Hyderabad : వాహనదారులకు బిగ్ అలర్ట్.. నేటి నుంచి ఉప్పల్ – వరంగల్ రోడ్ క్లోజ్.. ప్రత్యామ్నాయ మార్గాలివే.. వాహనదారులు ఈ మార్గాల్లో వెళ్లండి..
Hyderabad : ఉప్పల్ మీదుగా వివిధ ప్రాంతాలకు ప్రయాణించే వాహనదారులకు బిగ్ అలర్ట్. ఆదివారం నుంచి ఉప్పల్ - వరంగల్ రోడ్ను బంద్ చేశారు.
Traffic restrictions
- వాహనదారులకు బిగ్ అలర్ట్..
- ఉప్పల్ – వరంగల్ రోడ్ క్లోజ్..
- ప్రత్యామ్నాయ మార్గాలు ఇవే
Hyderabad : ఉప్పల్ మీదుగా వివిధ ప్రాంతాలకు ప్రయాణించే వాహనదారులకు బిగ్ అలర్ట్. ఆదివారం నుంచి ఉప్పల్ – వరంగల్ రోడ్ బంద్ కానుంది. ఉప్పల్ రింగ్ రోడ్డు నుంచి చిలుకానగర్ చౌరస్తా వరకు జాతీయ రహదారిని రెండు వైపులా మూసి వేశారు. ఉప్పల్ -నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనుల నేపథ్యంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు. లారీలు, ట్రక్కులు వంటి భారీ వాహనాలు ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా ఇతర మార్గాల్లో నగరంలోకి వెళ్లాలని సూచించారు. అయితే, సికింద్రాబాద్ వైపు నుంచి నాగోల్, ఎల్బీనగర్ వైపు, ఎల్బీనగర్ నుంచి సికింద్రాబాద్ వైపు వాహనాల రాకపోకలకు ఎలాంటి అటంకం ఉండదని అధికారులు తెలిపారు.
ప్రత్యామ్నాయ మార్గాలివే..
♦ వరంగల్ వైపు నుంచి నగరానికి వచ్చే కార్లు, మినీ ట్రక్కులు, ఇతర వాహనాలు ఉప్పల్లోని మెహ్ఫిల్ హోటల్ దాటిన అనంతరం ఎడమ వైపు రోడ్డు ద్వారా ఉప్పల్ భగాయత్ మీదుగా నాగోల్, మూసీ దాటిన అనంతరం వంతెన కింద యూటర్న్ తీసుకొని నగరంలోకి వెళ్లాలి.
♦ వరంగల్ వైపు నుంచి వచ్చే ద్విచక్ర వాహనదారులు ఉప్పల్లోని పాత రిజిస్ట్రేషన్ ఆఫీస్ మీదుగా ఉప్పల్ మెట్రో స్టేషన్ వైపు రావాలి.
♦ హైదరాబాద్ నుంచి వరంగల్ వైపు వెళ్లే వాహనదారులు సర్వే ఆఫ్ ఇండియా జంక్షన్ వద్ద పిస్తాహౌస్ పక్క రోడ్డు నుంచి బీరప్పగడ్డ మీదుగా జాతీయ రహదారి (163)కి వెళ్లాలి.
♦ ఉప్పల్ భగాయత్ రోడ్డు వెడల్పు తక్కువగా ఉన్న దృష్ట్యా.. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా హైదరాబాద్, సికిం ద్రాబాద్ వైపు వెళ్లే లారీలు, బస్సులు, ఇతర భారీ వాహనాలు ఘట్కేసర్ వద్ద ఔటర్ రింగ్ రోడ్డు ఎక్కి హయత్నగర్ వద్ద విజయవాడ రహదారి, ఎల్బీనగర్ మీదుగా రాకపోకలు సాగించాలి.
♦ నగరం నుంచి వరంగల్ వెళ్లే భారీ వాహనదారులు ఎల్బీనగర్ మీదుగా హయత్ నగర్ వద్ద ఔటర్ ఎక్కి ఘట్కేసర్ వద్ద జాతీయ రహదారిపైకి చేరుకోవాలి.
